ఇస్తారు విందులో పాల్గొన్న కోదాడ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లం

Mar 16, 2025 - 19:47
Mar 17, 2025 - 07:39
 0  13
ఇస్తారు విందులో పాల్గొన్న కోదాడ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లం

తెలంగాణవార్త ప్రతినిధి కోదాడ : BRS పార్టీ 26వ వార్డ్ ఇంఛార్జ్, యువజన నాయకుడు మహ్మద్ షాకీర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ *గౌ.శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు* పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు ఆచరిస్తున్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహ్మద్ షాకీర్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయం అని అందరూ సోదరభావంతో కలిసిమెలిసీ జీవించేందుకు ఈ ఇఫ్తార్ విందులు దోహదం చేస్తాయని ఆయన అన్నారు. గత BRS పార్టీ ప్రభుత్వంలో మాన్యశ్రీ కేసీఆర్ గారు మైనారిటీలకు క్యాబినెట్ లో సముచిత గౌరవం కల్పించారు. రాష్ట్ర హోంమంత్రిగా మైనారిటి నాయకుడు మహమూద్ అలీ గారిని నియమించి మైనారిటిలపై తనకున్న చిత్తశుద్ధి చాటుకున్నారని, అంతేకాక ప్రతి రంజాన్ మాసంలో ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ - ఏ - దావత్ లు ఏర్పాటు చేయడమేకాక రంజాన్ తోఫా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. మతసామరస్యంతో కోదాడ పట్టణ ప్రజలంతా విరాజిల్లాలని ఆయన అన్నారు.

 ఈ కార్యక్రమంలో BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, మాజీ ఎం.పి.టీ.సి. యండి.ఫయాజ్, మతగురువు ముఫ్తీ సాహెబ్, అబ్బు బకర్, కర్ల సుందర్ బాబు, యండీ ఇమ్రాన్ ఖాన్, చింతల లింగయ్య, షేక్ అబ్దుల్ అలీమ్, షేక్ నిస్సార్, షేక్ దస్తగిరి, చలిగంటి వెంకట్, జానీ ఆర్ట్స్, షేక్ యూసఫ్, షేక్ మీరా, చీమ శ్రీనివాసరావు, బచ్చలకూరి నాగరాజు, కర్ల నర్సయ్య, కలకొండ వెంకటనారయణ, గడ్డం యేసు తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State