ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీలకు శాపం

Sep 16, 2024 - 20:26
Sep 16, 2024 - 20:37
 0  38
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీలకు శాపం

16-09-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

చిన్నంబావి మండల బీసీ యువ నాయకుడు డేగా శేకర్ యాదవ్  కుల గనణ చేసి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి? అని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీలకు శాపం!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుల గణన చేసి బీసీలకు 42శాతం రిర్వేషన్లను కల్పించాలని ఈ.డబ్ల్యు.యస్/ రిజర్వేషన్లు బడుగులు/ వెనుకబడిన తరగతుల కు శాపంగా తయారైనట్లు చిన్నంబావి మండలానికి చెందిన విద్యావంతుడు బిసి యువ నాయకుడు డేగ శేఖర్ యాదవ్ ఈ సందర్భంగా అన్నారు,

ఈ. డబ్ల్యు. యస్/ అంటే, ఉన్నత కులాల్లో ఆర్థిక, వెనుకబాటు ఆధారంగా విద్య, ఉద్యోగాలలో ఇచ్చే రిజర్వేషన్లు. వీరికి మొత్తం ఉద్యోగాలల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు. సమాజంలో 5 శాతం ఉన్న వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం దుర్మార్గం. దీనివల్ల ముఖ్యంగా బీసీ అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారు..ఎస్సి, ఎస్టీ లకు వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు ఉండగా,సమాజంలో 55 శాతం పైగా ఉన్న బీసీ లకు 27శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని ఉదాహరణకు "ఈ. డబ్ల్యు. యస్ రిజర్వేషన్ పొందిన మహిళా అభ్యర్థి ,బీసీ మహిళ అభ్యర్థి కన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్నా ఉద్యోగం పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..

ఇది ఇటీవల తెలంగాణా పోలీస్ ఉద్యోగ నియామక పరీక్ష లలో, గురుకుల ఉద్యోగ పరీక్ష లలో ఈ విషయం నిరూపణ అయినట్లు ఆయన డేగ శేఖర్ యాదవ్  

అన్నారు,ఈ. డబ్ల్యు. యస్ వారికి రిజర్వేషన్లు ఇవ్వటం వల్ల మెరిట్ తెచ్చుకున్న ఎస్సి, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీ లలో అవకాశాలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు 

వీరు మెరిట్ తో ఓపెన్ కేటగిరీ లో ఉద్యోగం పొందినప్పుడే, ఇదే కేటగిరీ లోని కింది అభ్యర్థులకు వారి కేటగిరీ లో ఉద్యోగం తగ్గుతుందని కానీ "ఈ. డబ్ల్యు. యస్ విధానం వల్ల ఓపెన్ కేటగిరీ లో సెలెక్ట్ కావలసిన ఎస్సి, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అభ్యర్థులు కిందికి దిగి వారి రిజర్వేషన్ కేటగిరీ లోకి వెళ్ళవలసి వస్తుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు, ఫలితంగా కొంచం తక్కువ మార్కులు వచ్చి బోర్డర్ లో సెలెక్ట్ కావలసిన రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థులు ఉద్యోగం పొందలేకపోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు, ఈ. డబ్ల్యు. యస్/ రిజర్వేషన్లు రద్దు చేయకపోతే భవిష్యత్ లో అత్యున్నత ఉద్యోగాలల్లో వెనుకబడిన కులాల వారు చాల నష్టపోతరని ఆ ఉద్యోగాలలో సింహభాగం అగ్రకులాలవారే దక్కించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు, పాలకులంతా అగ్రకులాల వారే కావడంతో ,ఈ రిజర్వేషన్ లపై ఏమిమాట్లాడలేకపోతున్నారని

న్యాయస్థానాలు కూడా ఇటీవల కులగణనా చేయమని చెప్పింది కావున ఇది అమలు చేసి 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు,

బడుగు, బలహీన కులాలకు చెందిన నాయకులు, మేధావులు ఈ రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది..ముఖ్యంగా బీసీ నాయకులు ఉద్యమించాలి. ఎస్సి, ఎస్టీ లకు, వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు ఉన్నాయని

అగ్రకులాల వారికి "ఈ. డబ్ల్యు. యస్/రూపంలో వారి జనాభాకు మించి రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు,.కానీ బీసీ లకు మాత్రంవారి జనాభాలో సగం కన్న తక్కువ రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు,దీనివల్ల భవిష్యత్తు లో విద్యా, ఉద్యోగాలలో బీసీ పిల్లలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీ కులగణన జరగాలి, అప్పుడే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి "ఈ. డబ్ల్యు. యస్" / రిజర్వేషన్లు పై పునర్ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు,చట్ట సభలలో అగ్ర కులాలు వున్నంత కాలం బీసీలకు న్యాయం ఏ రంగంలో కూడ న్యాయం జరగడం లేదని అన్నారు,

కాబట్టి అగ్ర కులాల వారిని చట్ట సభలకు పంపే ఓటును అగ్రకులాలకు వేయకుండా. నిరాకరించాలని,అప్పుడు మాత్రమే బీసీ లకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని డేగ శేఖర్ యాదవ్ అన్నారు,

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State