ఇసుక ర్యాంపుల వల్ల రోడ్లు కల్వర్టు నాశనం అవుతున్నాయి

Jan 3, 2025 - 17:45
Jan 3, 2025 - 19:31
 0  2
ఇసుక ర్యాంపుల వల్ల రోడ్లు కల్వర్టు నాశనం అవుతున్నాయి

చర్ల, జనవరి 03 చర్ల మండలం జిపిపల్లి ఇసుక ర్యాంప్ వేల కొద్దీ లారీలు తిరగడం కారణంగా యాకన్నగూడెం,ఏదిరా మధ్యలో కల్వర్ట్ మొత్తం కుంగిపోయి చర్ల మండలానికి వెంకటాపురానికి వెళ్లే వెహికల్స్ మొత్తం బంద్ అయినాయని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని దీన్ని బట్టి చూస్తే అధికారులకు పెద్ద ముడుపులే అందాయని చర్ల మండలంలో ఉన్న గోదావరి ఇసుకను పక్క రాష్ట్రాలకు వేల లారీలల్లో తరలించి కోట్ల రూపాయలకు విక్రయం చేస్తున్నారని పరిధికి మించి పెద్ద పెద్ద యంత్రాలతో తాటి చెట్టు కంటే లోతు తవ్వి భూగర్భ జలాలు స్తంభించి పోయేలా, ఇవాళ రైతుల పంట పొలాలు మొత్తం నాశనం అయ్యే విధంగా ఈ ఇసుక ర్యాంపు ఉన్నది.ఈ ఇసుక ర్యాంపులో ఉపాధి అనేది ఒక్క వర్గానికే ఉపాధి అందుతుందని మిగతా గ్రామస్తులకు,వర్గాలకు ఉపాధి అనేది అందడం లేదని దీనిపైన రైతులు లారీలను అడ్డుకొని ఆందోళన చేసినా పట్టించుకునే నాధుడే లేడని ఇవాళ సీ కత్తిగూడెం,వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి రోడ్లు మొత్తం గుంటలు,గుంతలు పడి రోడ్లు మొత్తం నాశనం అయిపోయాయి చిన్న చిన్న కల్వర్ట్ లు మొత్తం కృంగిపోయి ఇప్పుడు వాహనాలు తిరగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఈ ఇసుక ర్యాంపు కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు కోల్పోయిన కుటుంబాలకి ఇసుకరాంపు కాంట్రాక్టర్లనేటోళ్లు కనీసం వారిని పరామర్శించిన సందర్భాలు కూడా లేవు ఇట్లాంటి విషయాలలో ప్రశ్నిస్తే అధికారులు బెదిరించటం అనేది జరుగుతా ఉన్నది ప్రజలకు ప్రశ్నించే హక్కు లేదా అని న్యూ డెమోక్రసీ పార్టీగా సూటి ప్రశ్న ఈరోజు ఉదయం ఎన్ని గంటలకు జిపి పల్లి ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్ కొంతమంది యువతను తీసుకొని బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు తక్షణమే ఇతను పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తాను లేనియెడల ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని అధికారులను హెచ్చరించడం జరుగిందని అన్నారు.