ఇరాన్ తో యుద్ధం అంత ఈజీ కాదు

Mar 6, 2026 - 20:09
 0  17
ఇరాన్ తో యుద్ధం అంత ఈజీ కాదు

శత్రు దేశాలు ఎన్ని అయినా ఒంటరిగా  బీకర పోరు చేస్తున్న ఇరాన్

అత్యంత అధునాతన ఆయుధాలతో కొనసాగుతున్న యుద్ధం

వణుకుతున్న గల్ఫ్ దేశాలు... బిక్కుబిక్కుమంటున్న భారతీయులు... స్వదేశం రావడానికి తీవ్ర ప్రయత్నాలు

డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, హ్యూమనిస్ట్, సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు

ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మధ్య గత ఐదు రోజులుగా జరుగుతున్న యుద్ధం నానాటికి తీవ్రతరం అవుతున్నది. కేవలం రెండు దేశాల మధ్యనే యుద్ధమని అనుకుంటున్నప్పటికీ ఇజ్రాయిల్ తరపున అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగడంతో యుద్ధం కొత్త రూపు, ఊపు సంతరించుకుంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం మాదిరిగా ఒక చిన్న దేశమైన ఇరాన్ పైన ప్రపంచమే కక్ష కట్టిందా అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇరాన్ కు రష్యా, చైనా మద్దతు ప్రకటించినప్పటికీ ఆయుధాల రూపేనా, ఆర్థిక వనరు వనరుల రూపేనా సహాయం అందించకపోవడంతో ఇరాన్ కు ఒంటరి పోరు తప్పలేదు. అయితే ఇజ్రాయిల్ కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలే కాకుండా అమెరికా మిలిటరీ స్థావరాలకు అడ్డాగా గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, యూఏఈ, జోర్డాన్, లేబనాన్, సిరియా, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇరాక్ దేశాల నుంచి అమెరికా ఇరాన్ పై దాడి చేస్తుంది. దీంతో ఇరాన్ ఇజ్రాయిల్ తో పాటు మొదటగా గల్ఫ్ దేశాలపై ప్రతి దాడిని మొదలుపెట్టింది. దుబాయ్, సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, గల్ఫ్ దేశాలలోని అమెరికా బేస్ క్యాంపు లపై ఇరాన్ బీకరపోరు మొదలుపెట్టింది. ఇరాన్ ఒక దేశమే అయినప్పటికీ ఇజ్రాయిల్, అమెరికాతో కలుపుకొని మరో 10 గల్ఫ్ దేశాలతో అంటే మొత్తం 12 దేశాలతో ఒక ఇరాన్ దేశమే యుద్ధం చేస్తుందంటే మామూలు విషయం కాదు. శత్రువు ఎంత బలంగా ఉన్నప్పటికీ ఇరాన్ సర్వశక్తులు ఒడ్డీ ప్రతిఘటిస్తుంది. విజయమో,వీర స్వర్గమో అన్నట్టుగా ఖమేని మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇజ్రాయిల్ అమెరికాకు తల వంచేది లేదని భీష్మించుకు ప్రతిజ్ఞ చేసి పోరాటం సలుపుతుంది. ఇరాన్ పని అయిపోయిందని, తాము యుద్ధంలో గెలుస్తున్నామని ట్రంప్ ప్రకటనలకు మాత్రమే పరిమితము అయినప్పటికీ వాస్తవ పరిస్థితులు యుద్ధ రంగంలో అందుకు భిన్నంగా ఉన్నాయని యుద్ధరంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అమెరికా ఆయుధ సామాగ్రి ఇంతింత కాదయా... గగనతలంలోనే సాగుతున్న పోరు

మానవ మేధస్సు సృష్టించిన కృత్రిమ మేధ ఏఐ సహాయంతో శత్రువు లక్ష్యాలను గుర్తించి అందుకు అనుగుణంగా క్షిపణులను, డ్రోన్లను ఉపయోగించడంతో యుద్ధం గగనతలంలో హోరా హోరుగా సాగుతుంది. అమెరికా తన ఎఫ్ 22 35 ఎఫ్ 18 ఎఫ్ 16 రాడార్లు ఫైటర్లతో 900 కిలోల బాంబులను జారవిడుస్తూ, బీ2 బాంబర్లు, బంకర్ బ్లాస్టర్ లతో యుద్ధం చేస్తుంది. దీంతోపాటు అమెరికా పేట్రియాట్ క్షిపణి, థాడ్ క్షిపణి, అటాక్ జెట్ లు, అవాక్స్ విమానాలు, గైడెడ్ మిస్సైల్స్, డెస్టయిర్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, ఈ ఏ 18 జి ఎలక్ట్రానిక్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్,  పి 8 తీర ప్రాంత గస్తీ ఎయిర్ క్రాఫ్ట్, ఎం క్యు 9 రిపేర్ డ్రోన్లు, ఎం 142 హై మొబిలిటీ ఆక్సిలరీ రాకెట్, రీ ఫీలింగ్ ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్ లు, షిప్పులు, c17 గ్లోబ్ మాస్టర్ రాడార్ విమానాలు, సి 130 రవాణా విమానాలు, ఇంకా కొన్ని పేరు బయటకు వెల్లడించని రహస్య ఆయుధ సామాగ్రితో అమెరికా  ఇజ్రాయిల్ మద్దతుగా ఇరాన్ దేశాన్ని లొంగ చేయడానికి తీవ్రతరంగా యుద్ధంలో పాల్గొంటుంది. ఇరాక్ కూడా తన ఆయుధ సంపత్తిని, వైవిధ్యమైన క్షిపని వ్యవస్థను కలిగి ఉంది. భూగర్భంలో వందల మీటర్ల లోతున మిస్సైల్ సిటీస్,  క్షిపని ప్రయోగ శాలలు ఏర్పాటు చేసింది. 75 కిలోమీటర్ల పరిధిలోని షార్ట్ రేంజ్ మిస్సైల్స్ తోపాటు 2000 నుండి 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సేదించడానికి కోరం షహర్ క్షిపణులు, షాహిద్ ఆత్మహుతి డ్రోన్లు ప్రయోగిస్తుంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐ ఆర్ జి సి), 1980లో ఏర్పాటైన లేబనాన్ దేశానికి సంబంధించిన  షియా మత రాజకీయ  సంస్థ హిజ్బుల్లా ఖమేని కి అనుకూలంగా ఉండటమే కాకుండా ఆయన మరణం తర్వాత ఇజ్రాయిల్ పై అధికారం తీర్చుకోవడానికి లేబనాన్  నుంచి ఇజ్రాయిల్ పై పోరు సల్పుతుంది. ఇజ్రాయిల్ కూడా తన ఆయుధ సంపత్తిని తీవ్రస్థాయిలో ప్రయోగిస్తూ ఇరాన్ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. హార్ముజ్ జల సందిని ఇరాక్ మూసి వేయడంతో ఆ జల సంధి గుండా రోజువారీగా ప్రయాణించే వందలాది నౌకలు సముద్రంలో నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. తద్వారా పలు దేశాల్లో డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఖతార్ దేశం ఎల్పీజీ గ్యాస్ రవాణా నిలిపివేసింది. ఇరాన్ దేశం  చమురు షిప్పులకు సంబంధించి జిపిఎస్ ను జామింగ్ చేయడం, సిగ్నల్ను స్నూపింగ్ చేయడం వలన డిజిటల్ పొగ ఆవరించి నావిగేషన్ వ్యవస్థలు తప్పుగా చూపిస్తూ ఆయిల్ నౌకలన్నీ ఎడారిలో ఉన్నట్టుగా చూపించడంతో అంతా గందరగోళంగా మారింది. ఎలక్ట్రానిక్ రక్షణ కవచం యాక్టివేట్ చేయడం తో రాడార్ బైండింగ్ వలన జల సంధి వద్ద ఎలక్ట్రానిక్ రణభూమి లాగా మారి చమురు నౌకలు అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

గల్ఫ్ దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు... అందులో 15 లక్షల మంది తెలంగాణ వాసులు.. ఉత్తర తెలంగాణ వాసులే తొమ్మిది లక్షల మంది

గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు ఎలాంటి హాని కలగడం లేదని ఆయా ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ అప్పుడప్పుడు అక్కడున్న భారతీయులు తాము ఏ విధంగా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నామో అంటూ సెల్ఫీ వీడియోలు ప్రసారం కావడంతో పరిస్థితి సీరియస్ గా ఉందని అర్థం చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి భారతీయులు దాదాపు 90 లక్షల మంది, ముఖ్యంగా తెలంగాణ వాసులు 15 లక్షల మంది అందులోని ఉత్తర తెలంగాణ వాసులే 9 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో వివిధ వృత్తులలో ఉండటంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కువగా యూఏఈ దుబాయ్ లో 35 లక్షల 54,274 మంది, సౌదీ అరేబియాలో 24, 60,603, ఇరాన్ లో 10, 320, ఇజ్రాయిల్లో 20000, జోర్డాన్ లో 16,897, ఇరాక్ లో 17,100, కువైట్ లో 9, 93, 284, ఖతార్ లో 8, 35, 175, ఒమన్ లో 6, 84, 771, యమన్ లో 700, సిరియాలో 97, పాలస్తీనాలో 11, బహ్రెయిన్ లో 3, 23, 908 ఇలా మొత్తం 89 లక్షల,23, 281 మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది స్వదేశమైన భారత్ కు రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. యుద్ధం ఎన్ని రకాలుగా ఎన్ని రోజులుగా చేస్తారో, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అన్న సందిగ్ధ పరిస్థితుల్లో భారతీయులు కొట్టుమిట్టాడుతూ బతికి ఉంటే బలుసాకు అయినా తిని బతకవచ్చు అన్న సామెత చందంగా స్వదేశం పోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వీలైనంత తొందరగా యుద్ధం ముగియాలని, భారతీయులందరూ కూడా క్షేమంగా ఉండాలని మనమూ కోరుకుందాం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333