ఇది మంచి ప్రభుత్వం
ఇది మంచి ప్రభుత్వం ఈరోజు జగ్గయ్యపేట మండలం, ముక్తేశ్వరపురం గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన కార్యక్రమంలో గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వంద రోజుల ప్రభుత్వ పరిపాలన ప్రజల నమ్మకాన్ని చూడదున్నదని గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుండి 100 రోజులలో వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, పెన్షన్ పెంపుదల, ప్రజలకు ఉచిత ఇసుక అందించటం, యువతకు ఉద్యోగాల కల్పనకు మెగా డీఎస్సీ , పేదలకు ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు. ప్రజల కంటికి నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు. ప్రతినెల ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని.
1674.47 కోట్ల దాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతలను ఆదుకున్నారు.
స్థానిక సంస్థలకు 1452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు. విజయవాడ నగరంలో వరదలలో విలవిలలాడుతున్నప్పుడు
పది రోజులపాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను
ఓ తండ్రిలా కాపాడుకున్నారని వందరోజుల పరిపాలనపై గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద గ్రామ సర్పంచి షేక్ అస్మతున్ బేగం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కట్టా వెంకట నరసింహారావు పాల్గొని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు గద్దె రాజ్యలక్ష్మి అగ్రహారం గ్రామ పార్టీ అధ్యక్షులు అనుమాల వేదాద్రి, గ్రామ నాయకులు వర్మ గారు షేక్ ఉమర్ మచ్చ ప్రసాద్ గ్రామ పార్టీ అధ్యక్షులు కంబాల రవి, బండారు శ్రీను, మొగల్ నాగుల్ మీరా, కందుకూరి శ్రీను, మోకా సత్యనారాయణ,
దాది వెంకట నరసయ్య, మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.