ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ తాతయ్య గారు
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం..... ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట పట్టణం ఆర్టీసీ కాలనీ కు చెందిన కొత్తా నాగరాజు గారి కుమారుడు కొత్తా భవదీప్ వరదల సమయంలో వైరస్ కారణంగా కాల్లు ఇన్ఫెక్షన్ అవడంతో వారు శ్రీరాం తాతయ్య గారిని ఆశ్రయించగా శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి వెనువెంటనే 10 లక్షలు మంజూరు చేయించడం జరిగింది. ఆ సమయంలో కుమారుడి వైద్య నిమిత్తం ఎంతైనా సరే ప్రభుత్వం ద్వారా నేను చేయిస్తానని మాట ఇచ్చి భరోసా ఇవ్వటం జరిగింది, అనంతరం వారికి అంకుర హాస్పిటల్ లోనే వైద్యం చేయడం జరుగుతుంది. కానీ వైద్య ఖర్చుల నిమిత్తం మరల రెండవసారి డబ్బులు అవసరం వారు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారిని ఆశ్రయించగా ఎమ్మెల్యే గారు నాగరాజు గారిని తీసుకొని వెళ్లి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారు చాలా పేద కుటుంబానికి చెందిన వారని వారికి ఇప్పుడు ఎల్వోసి మంజూరు చేస్తేనే కుమారుడు వైద్యం చేయించుకొని సురక్షితంగా ఉంటారని చెప్పి సాధ్యంకానీ దానిని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు రెండవ ఎల్ వో సి 5,00,000 మంజూరు చేయించి ఆ యొక్క పత్రాలను అంకుర హాస్పిటల్ నందు కొత్తా నాగరాజు గారి దంపతులకు ఇవ్వడం జరిగినది.
తనపై సహోదయంతో రెండవ ఎల్వోసీ చేయించినటువంటి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారికి మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కొత్తా నాగరాజు గారు చాలా కృతజ్ఞత లు తెలిపారు.