ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది

Apr 12, 2026 - 12:59
Apr 12, 2026 - 13:07
 0  26
ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది
ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది
ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది
ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది

పేదల మొహంలో చిరునవ్వు చూడటమే మా ప్రజా ప్రభుత్వ ద్వేయం.

ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.

గుంజలూరు/చివ్వెంల, 12 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతీ ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఛివ్వేంల మండలంలోని గుంజలూరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్ తో కలిసి లబ్ధిదారులు మొలుగురి ప్రభావతి ప్రభాకర్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు ఊరించిన గత ప్రభుత్వం ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రతీ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.

“ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ద్వేయం” అని పేర్కొన్నారు. గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అని చెప్పి పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నిజమైన న్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని సర్వోత్తమ్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గుంజాలరు సర్పంచ్ బొల్లికొండ సైదులు, ఉప సర్పంచ్ దొనకొండ పావని మహేష్,వార్డ్ సభ్యులు కొప్పు సైదులు కొనకంచి మల్లయ్య పెదపోలు చందన, జిల్లా ఎస్సి సెల్ చైర్మన్ అమరారపు శ్రీనివాస్,పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి చింతమళ్ల రమేష్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజాద్ అలి, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, సేవదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెన్న మధుకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పడిదల రవి కుమార్, నాగు నాయక్, చింత నవీన్, వెంకటయ్య, దారోజుభాగ్యరాజు గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ దొనకొండ వీరయ్య  మాజీ ఉప సర్పంచ్ పెద్ది అంజయ్య నాయకులు వీరబోయిన అశోక్ వీరబోయిన వీరయ్య వీరబోయిన ప్రశాంత్ దారోజు కోటయ్య బొజ్జ పాపి రెడ్డి మొలుగురి మైసయ్య మొలుగురి పుల్లయ్య మొలుగురి వెంకన్న బొల్లికొండ శరత్ బొల్లికొండ లింగయ్య కొప్పు భద్రాద్రి పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333