*ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి

Jul 21, 2026 - 13:34
Jul 21, 2026 - 17:35
 0  64
*ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి
*ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి

ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి

సమావేశం నిర్వహించిన సర్పంచ్ వాసం రాజబాబు

జులై 21 తెలంగాణ వార్త : ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు గ్రామపంచాయతీలో సర్పంచ్ వాసం రాజబాబు ఇందిరమ్మ ఇల్లు త్వరగా పూర్తి చేయాలని సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు పాల్గొని వాళ్ల సమస్యలు తెలియజేశారు సర్పంచ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు, రేగులపాడు, మోతుక్కులగూడెం, బయ్యారం , వార్డ్ మెంబర్లు మాట్లాడుతూ, వీధిలైట్లు వెలగడం లేదని త్వరగా వీధిలైట్లు అమర్చాలని, మోతుక్కులగూడెం వాటర్ ట్యాంక్ ద్వారా త్రాగునీటి సరపరాను వెంటనే పునరుద్ధరించాలని, సీసీ రోడ్డు చివర డ్రైనేజ్ తూములను నిర్మించాలని , ప్రతి వార్డులో బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమలను నివారించాలని, మురుకు కాలువలను శుభ్రం చేసి చెత్తను కాల్వల నుంచి తీసేసి గ్రామ పరిశుద్ధాన్ని మెరుగుపరచాలని, వార్డు మెంబర్లు గ్రామస్తులు సర్పంచ్ కు వినతి పత్రం అందజేశారు, వినతి పత్రం అందుకున్న సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ సమస్యలను త్వరగా పూర్తయ్యలా చూస్తామని వార్డు మెంబర్లకు గ్రామస్తులకు హామీ ఇచ్చారు

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్