ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

Jul 20, 2026 - 10:11
Jul 20, 2026 - 23:58
 0  117
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

  తిరుమలగిరి 20 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 అర్హులైన లబ్ధిదారులను గుర్తించకపోవడం విడ్డూరం

ఇందిరమ్మ ఇండ్లు తక్షణమే ఇవ్వాలి 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలలో తక్షణమే అమలు చేయాలని జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య కోరారు   అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల కావస్తున్నా నేటికీ ఎన్నికల వాగ్దానం అమలు చేయకపోవడం శోచనీయం   తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను గుర్తించకపోవడం బాధాకరమైన విషయం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో బీదవారు లేరా ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వరా ఇది ప్రస్తుత ఉన్న పాలకులకు అధికారులకు ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్టేనా లేదు    ప్రభుత్వం ఆర్భాటంగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం అని చెప్పి ఉంది కానీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఇప్పటివరకు ఇందిరమ్మ మహిళల లబ్ధిదారులను గుర్తించకపోవడం శోచనీయం ప్రస్తుతం పాలకులు పదవుల మీద ఉన్న ఆమోహం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు    ప్రజల మీద మీకే మాత్రము సిద్ధ శుద్ధి ఉన్న తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో పరులైన లబ్ధిదారులను గుర్తించి తక్షణమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య డిమాండ్ చేస్తున్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి