ఇండియన్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
సూర్యాపేట జిల్లా కేంద్రం, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని భగత్‌సింగ్ నగర్‌లోని ఇండియన్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ ని తోటి ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ రమేష్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అందరినీ ఘనంగా సన్మానించారు. ప్రతి ఉపాధ్యాయునికి శాలువా కప్పి, జ్ఞాపికలను అందజేసి వారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణను నేర్పించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.