ఇంటిపై కరెంటు వైర్లకు ఇనుపకడ్డీ తకి వ్యక్తి మృతి 

Jun 27, 2025 - 15:03
 0  5
ఇంటిపై కరెంటు వైర్లకు ఇనుపకడ్డీ తకి వ్యక్తి మృతి 

అడ్డగూడూరు 25 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరధిలోని ఆజీంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల పార్టీ యువజన అధ్యక్షులు లింగాల అశోక్ గౌడ్ తండ్రి లింగాల యాదయ్య సుమారు వయసు 70 సంవత్సరాలు బుధవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో తన ఇంటిపై ఉన్న కరెంటు వైర్లకు ఇనుపకడ్డీ తాకి మృతి చెందిన ఘటన ఆజీంపేట గ్రామంలో చోటుచేసుకుంది. హుటాహుటిన స్థానికులు అంబులెన్స్ లో మోత్కూర్ లక్ష్మీనరసింహ హాస్పిటల్ కు తీసుకుపోతుంటే మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.మృతికి కారణం విద్యుత్ అధికారులే అని గ్రామస్తులు,స్థానికులు తెలిపారు.పలుమార్లు అధికారులకు ఇంటి పై నుండి వైర్లు మార్చమని చెప్పిన వినిపించుకోకుండా ప్రాణాలు పోయినా పట్టించుకోని వైనం అడ్డగూడూరు మండలంలోని వివిధ గ్రామాలలో ఇండ్లపై ఉన్న వైర్లను చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న విద్యుత్ అధికారులు ఆజీంపేట గ్రామంలోనీ మృతిని బంధువులు,గ్రామస్తులు శోసముద్రంలో మునిగారు.ఇప్పటికైనా అక్కడక్కడ ఉన్న కరెంటు వైర్లను.. తొలగించాలని గ్రామస్తులు.. అధికారులను కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333