ఆస్తి తగాదలో ఇరువురికి గాయాలు..ఎస్సై వెంకట్ రెడ్డి

May 11, 2026 - 19:07
May 11, 2026 - 19:42
 0  2
ఆస్తి తగాదలో ఇరువురికి గాయాలు..ఎస్సై వెంకట్ రెడ్డి

అడ్డగూడూరు 11 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానాయకుంట గ్రామంలో ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో ఎస్ కె సత్తార్ తండ్రి వాలీబాషా కి అన్న భార్య ఎస్ కె అభిబా భర్త యాకుబ్, ఆమె కొడుకు మధ్య ఆస్తి తగాదాల విషయంలో గొడవ జరిగి ఒకరిని ఒకరు కొట్టుకోవటంతో ఇరువురికి గాయాలు అయినవి సత్తార్ కి తలపై గాయంవల్ల రక్తం కారాడంతో పెట్రోలింగ్ కార్ లో సగం దూరం రాగానే 108 అంబులెన్స్ రావడం జరిగింది.పోలీస్ వాహనం నుండి 108 వాహనంలో భువననగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.గ్రామంలో నివాసం లేనట్లు..ఎస్ కే సత్తార్ పండుగకి హైదరాబాదు నుండి మానాయకుంట గ్రామానికి యన్,జి కొత్తపల్లి నుండి మానాయకుంట గ్రామానికి వచ్చి ఘర్షణకు పాల్పడినట్టు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.