ఆస్తికోసం కూతుర్ని చంపిన సవతి తల్లి

Apr 13, 2025 - 22:47
Apr 13, 2025 - 22:49
 0  15
ఆస్తికోసం కూతుర్ని చంపిన సవతి తల్లి

ఆస్తికోసం కూతుర్ని చంపిన సవతి తల్లి తన ప్రియుడైన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్,అతని స్నేహితుని సహాయంతో చంపి వంగమర్తి వాగులో పూడ్చిన వైనం డిసెంబర్ 7న హత్య,నాలుగు నెలల తర్వాత మేడిపల్లి పోలీసులతో వెలుగులోకి హత్య ఉదాంతం ,శాలిగౌరారం రోజురోజుకి మానవత్వం కనుమరుగౌతుందనేది నేడు మనం నేడు అనేక విషయాల్లో చూస్తున్నాం. ఆస్తికోసం పెద్ద భార్య కూతుర్ని పినతల్లి హత్య చేసి,వంగమర్తి గ్రామ శివారు మూసి వాగులో పాతిపెట్టిన విషయం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో చోటుచేసుకుంది.మేడిపల్లి పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జటోతు మహేశ్వరి,తండ్రి పణి నాయక్ వయస్సు {26} సంవత్సరాలు బీఎ స్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి బోడుప్పల్ లోని లక్ష్మీ నగర్ కాలనీ లో తన తండ్రి పణి నాయక్ తో కలిసి ఉంటుంది. మహేశ్వరి తండ్రి పణి నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ నందు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఫణి నాయక్ కు మొదటి భార్యకు కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయి ఉంటున్నారు. వారికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు.కూతురు మహేశ్వరీ తండ్రి దగ్గర, కొడుకు ఏమో తల్లి దగ్గర ఉండేటట్లు నిర్ణయం చేసుకొని జీవిస్తున్నారు. ఫణి నాయక్ రెండో వివాహం చేసుకున్న భార్య కి ఒక పాప ప్రస్తుతం బోడుప్పల్లో ఉంటున్నారు. ఫణి నాయక్ కు బోడుప్పల్ లో రెండు ఇండ్లు కలవు, పెద్ద భార్య కూతురు మహేశ్వరి కి పెళ్లి సంబంధం కుదరగా కట్నం కింద మహేశ్వరికి ఒక ఇల్లు ఇచ్చుటకు నిర్ణయం చేసుకొన్నారు. ఆ విషయం జీర్ణించుకోలేని రెండో భార్య తనతో అక్రమ సంబంధం పెట్టుకొన్న సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తో పెద్ద భార్య కూతురు అయిన మహేశ్వరి ని చంపినట్లైతే రెండో ఇల్లు కూడా మనకి వస్తదని పథకం వేసుకున్నారు. దాని ప్రకారం గా తేదీ 7 12 2024 రోజున మధ్యాహ్నము బోడుప్పల్ లో పణి నాయక్ ఇంట్లో రెండవ భార్య మరియు అక్రమ సంబంధం పెట్టుకున్న సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్,అతని స్నేహితుడు కలిసి మహేశ్వరుని ఊపిరాడకుండా చంపేసి,ఒక గోనె సంచిలో పట్టి అక్కడి నుండి తీసుకొని వచ్చి అదే రోజు రాత్రి వంగమర్తి గ్రామ శివారులో మూసి బ్రిడ్జి కింద పిల్లర్ నెంబర్ వన్ దగ్గర గోతి తీసి పాతి పెట్టినారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ముతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేస్ ని నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీస్ వారు ఈ కేసును ఛేదించారు, నేరస్తులతో వంగమర్తి కి వచ్చి చనిపోయిన మహేశ్వరి ని బయటకు తీసి పోస్టుమార్టం చేయించి తదనంతరం బాడీని బంధువులకు అప్పగించారు.

నోట్:-ఈ విషయం పై మేడిపల్లి పోలీస్ లను వివరణ కోరగా మేడిపల్లి లో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు తెలియజేస్తాం అని చెప్పారు.

ఫోటో రైటప్ :

 1.ఆస్తికోసం హత్య చేయబడ్డ మహేశ్వరి {ఫైల్}.

2.గోనె సంచిలో మహేశ్వరి మృత దేహం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333