ఆశ కార్యకర్త కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Dec 18, 2024 - 04:05
Dec 18, 2024 - 11:18
 0  277
ఆశ కార్యకర్త కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

నాగారం 18 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- నాగారం మండలం సబ్ సెంటర్ ఫణిగిరి పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో ఆశ కార్యకర్తగా పనిచేస్తున్న మరియమ్మ గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఐ ఎన్ టి యు సి అనుబంధ ఆశ కార్యకర్తల సంఘం రాష్ట్ర కోశాధికారి కలమ్మ కోరారు ఐ ఎన్ టి యు సి అనుబంధ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మైముద అదేశాల మేరకు పెరాల మరియమ్మ అంత్యక్రియలో పాల్గొని అనంతరం ఆమె మాట్లాడుతూ మరియమ్మ  కుటుంబానికి  ఆశ వర్కర్స్ యూనియన్ అండగా ఉంటుందని తెలియజేశారు. ఆశ కార్యకర్తగా విధులు నిర్వహిస్తూ చనిపోయిన ఆశా కార్యకర్తలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం కల్పించాలని ఆరోగ్య భీమా ను వర్తింపజేయాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోపగాని విజయ, నాటి జయమ్మ, విజయ యాగలక్ష్మి , మహేశ్వరి , కళమ్మ , భద్ర , శారద , ఉమా , జ్యోతి, సునీత ,  పెంటమ్మ మంజుల సుజాత వివిధ మండలాల ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034