ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాను.

Feb 8, 2026 - 21:43
Feb 8, 2026 - 21:44
 0  4
ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాను.

14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్. 

(సూర్యాపేట టౌన్ ఫిబ్రవరి 8)

కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని 14 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పంతంగి దశరథ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం వార్డులో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. నూతనంగా రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వార్డు లో మంచినీటి సౌకర్యం మోరుగుపడే విధంగా చర్యలు చేపడతానని అన్నారు. ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి నన్ను వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే 14వ వార్డును దత్తత తీసుకొని వార్డులో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారని అన్నారని అన్నారు. 14వ వార్డును ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుజన్, ఓరి పెళ్లి లక్ష్మణ్, సిద్ధి లింగం, శ్రావణ్, వార్డు ప్రజలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333