ఆలేటి లింగమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు కడియం రామచంద్రయ్య
శాలిగౌరారం 28 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని తుడిమిడి గ్రామంలో పవన్ సాయి హాస్పిటల్ అధినేత ఆలేటి శ్రీనివాస్ మాతృమూర్తి అయిన ఆలేటి లింగమ్మ పరమపదించిన విషయం తెలుసుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తి నియోజక వర్గ ఇంచార్జ్ కడియం రామచంద్రయ్య ఆలేటి శ్రీనివాస్ ని వారి నివాసం వద్ద కలిసి పరామర్శించారు.వారితో పాటుగా తుంగతుర్తి నియోజకవర్గ విశ్వకర్మ యోజన కన్వీనర్ గిరగాని యాదగిరి,జిల్లా నాయకులు జమ్ము రమేష్,శాలిగౌరారం మండల అధ్యక్షుడు తోట వినోద్ కుమార్,మోత్కూరు రూరల్ అధ్యక్షుడు గూడెం మధుసూదన్ యాదవ్, శాలిగౌరారం మండల నాయకులు కొండ్రెడ్డి వేణుగోపాల్ రెడ్డి,తుల వెంకటేశ్వర్లు,నూనె గట్టయ్య,ఎస్కే సయ్యద్,బోడ రాజు,ఎరుకల గణేష్ తదితరులు పాల్గొన్నారు.