ఆర్.కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన మార్త వెంకన్న యాదవ్

Sep 29, 2026 - 20:08
 0  1
ఆర్.కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన మార్త వెంకన్న యాదవ్

అడ్డగూడూరు 29 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- బీసీ సంఘం అడ్డగూడూరు మండల అధ్యక్షుడు మార్త వెంకన్న యాదవ్ బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యను హైదరాబాద్ లోని  వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బీసీల సంక్షేమం హక్కులు,సామాజిక న్యాయం,బీసీల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆర్. కృష్ణయ్యతో చర్చించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..అడ్డగూడూరు మండలంలో బీసీ సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు,బీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మార్త వెంకన్న యాదవ్ తెలిపారు.బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని, యువతకు విద్య,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333