ఆర్.ఎన్.కె.కె మేనేజింగ్ డైరెక్టర్ జమ్ముల రవి సంతోషల వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఇబ్రహీంపట్నం:5 జూలై 2025 శనివారం తెలంగాణ వార్త రిపోర్టర్:-ఇబ్రహీంపట్నం నియోజకవర్గం,మన్నెగూడ తన స్వగృహం నందు చైర్మన్ వివాహ వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు.తదనంతరం చైర్మన్ దంపతులకు శాలువాలతో, బొకేలతో సత్కరించి, కేక్ కదిరించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. చైర్మెన్ మాట్లాడుతూ మా యొక్క వివాహ కార్యక్రమానికి విచ్చేసి పరోక్షంగా ప్రత్యక్షంగా మాకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ జమ్ముల నరేందర్, ఆమలూరి కిరణ్ బాబు,ఆమలూరి కార్తీక్, జమ్ముల బాలకృష్ణ మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.