ఆరుతడి పంటలు పండించాలి ఏవో నాగేశ్వరరావు

Jul 24, 2026 - 21:50
Jul 24, 2026 - 23:31
 0  4
ఆరుతడి పంటలు పండించాలి ఏవో నాగేశ్వరరావు

తిరుమలగిరి 25 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం సిద్ధి సముద్రం గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఆరు తడి పంటలపై రైతులకు అవగాహన నిర్వహించారు. ఏవో నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగుపైనే ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. ఎల్ నినో కారణంగా రాబోయే కాలంలో వర్షభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, సకాలంలో వర్షాలు కురవకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ పద్ధతిలో ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేసి నష్టపోవడం కంటే, ప్రభుత్వ సూచనలు మరియు వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ ఆరుతడి పంటలను సాగు చేయడమే శ్రేయస్కరమని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధరావత్ సుజాత రాజశేఖర్ ఏఈఓ భవ్య, రైతు ప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి