ఆపదలో ఉన్న స్నేహితునికి అండగా పదవ తరగతి స్నేహితులు
మేమున్నామని.. స్నేహితుడి కి అండగా 10వ తరగతి మిత్రుల ఆర్థికసాయం
తిరుమలగిరి 18 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన జోగు విజయ్ కుమార్ కి రోడ్డు ప్రమాదం జరిగి తలకు, ప్రక్కటెముకలకి తీవ్ర గాయాలు కావడం జరిగింది. విషయం తెలుసుకున్న(2010–2011) పదవ తరగతి బ్యాచ్ కు చెందిన స్నేహితులు నిమ్స్ ఆసుపత్రులో చికిత్స పొందుతున్న విజయ్ ని కలిసి పరామర్శించి తమ వంతు ఆర్థిక సహాయంగా రూ 35 వేల రూపాయలని కుటుంబ సభ్యులకు అందజేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు సహాయ సహకారం ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని వారు పేర్కొన్నారు.తమ బ్యాచ్‌లో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా సహాయం చేయడంలో ముందుంటామని తెలిపారు. విజయ్ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తదితరులు పాల్గొన్నారు....