ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అధికారులు

తిరుమలగిరి 26 జూలై 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సూర్యాపేట జెడ్పి సీఈవో అప్పారావు ,మరియు డి ఆర్ డి ఎ పి డి మధుసూదన రాజ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగినది. మండల కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మరియు వార్డు ఆఫీసర్లు,ఈజీఎస్ సిబ్బందితో సంపద వనాలపై అవగాహన నిర్వహించడం జరిగినది. అనంతరం వెలిశాల తొండ తాటిపాముల గ్రామాలలో గల సంపద వనాలను మరియు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరియు దళిత బంధు లబ్ధిదారుల యూనిట్లను పరిశీలించడం జరిగిందిి . వారి వెంట ఎంపీడీవో బి.లాజర్ , మున్సిపల్ కమిషనర్ రామ దుర్గా రెడ్డి , ఎంపీ ఓ కే మారయ్య మరియు పంచాయతీ కార్యదర్శులు,వార్డు ఆఫీసర్లు,ఈజీఎస్ సిబ్బంది పాల్గొనడం జరిగినది.