ఆంగ్లకన్ క్లర్జ్ ఎపిస్కోపల్ ఆఫ్ డయాసిస్ ( ఏ. సి. ఇ) మీడియా, కమ్యూనికేషన్ మెంబర్ గా బిషప్ డా. దుర్గం ప్రభాకర్ బేతెస్థ మినిస్ట్రీస్ సూర్యాపేట
ఆగస్టు 14 గురువారం : ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరు పట్టణ కేంద్రం అబైడింగ్ హోప్ చర్చ్ నందు డిప్యూటీ మోడరేటర్ బిషప్ డా యం. టైటస్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ 4 వ హౌస్ ఆఫ్ బిషప్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంనకు భారత దేశ వ్యాప్తంగా అన్నీ రాష్టాల నుండి 70 మంది బిషప్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిదిగా మోస్ట్ రెవరెండ్ డాక్టర్ సి. హెచ్. విజయ్ మోహన్ రావు ప్రిమెట్ ఆర్చ్ బిషప్ ( ఏ. సి. ఇ. డయాసిస్ ) హైదరాబాద్, బిషప్ సి. హెచ్. ప్రవీణ్ ఏ. సి. ఇ డయాసిస్ డైరెక్టర్ పాల్గొని,వరల్డ్ వైడ్ ఆంగ్లకన్ చర్చేస్ మీడియా, కమ్యూనికేషన్ మెంబర్ గా బిషప్ డా. దుర్గం ప్రభాకర్ ను నియమిస్తూ ప్రకటన చేశారు. ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించినదుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బిషప్ డా దాస్ ఎల్లం నిజామాబాద్,బిషప్ డా జాన్ కాంతారావు ఖమ్మం, బిషప్ డా ముల్లంగి జాకబ్ రాజు సూర్యాపేట, ఆర్చ్ బిషప్ దయానంద్ హైదరాబాద్, ఆర్చ్ బిషప్ సమర్పణ కుమార్, రెవ. ఏర్పుల క్రిస్టోఫర్, రెవ. యం. రూబెన్, యస్. క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు