అర్వపల్లి నూతన ఎస్ఐ గా సైదులు

తిరుమలగిరి అర్వపల్లి 02 జులై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల నూతన ఎస్ఐ గా సైదులు నేడు బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ ఎస్ఐ గా పనిచేసిన చింతకాయల బాలకృష్ణ నల్గొండ విఆర్ కు బదిలీపై వెళ్లారు... సూర్యాపేట జిల్లా టూ టౌన్ ఎస్ఐ బాధ్యతలు నిర్వర్తించి బదిలీలో భాగంగా నేడు అర్వపల్లి మండల నూతన ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నూతన ఎస్ఐ మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులకు సమన్వయం అందిస్తానని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని, అదేవిధంగా మండలంలోని ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు....