అరుణాచల గిరి ప్రదర్శనకు గద్వాల డిపో నుంచి ప్రత్యేక బస్సు.
తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు శుభవార్త.
జోగులాంబ గద్వాల 15 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జూలై నెల శివ దర్శనార్థనమై పౌర్ణమి సందర్భంగా జూలై 21న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని TGSRTC నాగర్ కర్నూల్ డిపో మహబూబ్నగర్ డిపో నుండి మరియు గద్వాల డిపో నడపాలని నిర్ణయించింది. బస్సు.. జూలై 19-07-2024న రాత్రి 9:00 గంటలకు గద్వాల బస్టాండ్ నుండి బయలుదేరి 20.07.2024 న ఉదయానికి కాణిపాకం చేరుకుంటుంది. కాణిపాకం దర్శనానంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం వేలూరు గోల్డెన్ టెంపుల్ కు చేరుకొని దర్శనం అనంతరము రాత్రికి అరుణాచలం చేరుకుంటుంది. అరుణాచలేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ మరియు దర్శనానంతరం తర్వాత 21.07.2024 న సాయంత్రం 04.00 గంటలకు తిరుగు ప్రయాణం బయలుదేరి జూలై 22న తేదీ ఉదయం 06.00 గంటలకు గద్వాల కు చేరుకుంటాము. అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా టీఎస్ఆర్టీసీ అందిస్తోంది. ఈ టూరు ప్యాకేజీ ధరలను ఒక్కొక్కరికి పెద్దలకు రూ.3600.00 గా పిల్లలకు రూ.2400 గా సంస్థ నిర్ణయించింది అన్ని సెస్ చార్జీలు బోర్డర్ టాక్స్ లు మరియు టోల్ టాక్స్ లు కలుపుకొని టూర్ ప్యాకేజీగా అందిస్తుంది.
పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణ కు భక్తుల రద్దీ దృష్ట్యా నాగర్ కర్నూల్ నుంచి mahaboobnagar నుంచి మరియు గద్వాల ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది.ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు వినియోగించుకొనగలరు. ఈ టూర్ ప్యాకేజీని ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చును బస్టాండ్ లో బస్ పాస్ రిజర్వేషన్ కౌంటర్లలో OPRS NUMBER 98892 బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం ఫోన్ నంబర్లను 9390550678, 7382829328,7382829355 సంప్రదించగలరని డిపో మేనేజర్ R మంజుల సూచించారు.