అరవింద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మిక తనిఖీ

Aug 26, 2025 - 19:43
 0  43
అరవింద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మిక తనిఖీ
అరవింద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మిక తనిఖీ
అరవింద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మిక తనిఖీ
అరవింద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మిక తనిఖీ

 జోగులాంబ గద్వాల 26 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల  తేదీ 26.8.2024 న, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్యాధికారి డాక్టర్. ఎస్కే సిద్ధప్ప   ఆదేశాల మేరకు, స్థానిక గద్వాల, సుంకులమ్మ మెట్టు లో, ""అరవింద్"" ప్రథమ చికిత్స కేంద్రం ను " ప్రోగ్రామ్ ఆఫీసర్, మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జి. ప్రసూన రాణి మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేశారు...


    ఈ ఆకస్మిక తనిఖీ లో ప్రథమ చికిత్స నిర్వహించు నిర్వాహకుడు రామన్ గౌడ్ , రోగులకు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించడం, యాంటీబయటిక్స్ పెయిన్ కిల్లర్స్ స్థిరాయిడ్స్ , సిరప్స్, ఐవీ ఫ్లూయిడ్స్, ఇవ్వడం, జిల్లా అధికారులు  గుర్తించారు.  ప్రిస్క్రిప్షన్ రాయడం ,రోగులకు రక్త పరీక్షలు కొరకు టెస్టులు రాయడం, వాంతులు బేదులు జ్వరము ఉన్న రోగులకు చికిత్సలు చేసి, గ్లూకోజ్ బాటిళ్లు ఎక్కించడం, నేబిలైజేషన్ మిషన్, కుట్లు వేసే సామాగ్రి కలిగి ఉండడం  ను అధికారులు గుర్తించారు..
అదేవిధంగా తన పేరుకు ముందు డాక్టర్ అని రాసి ఉంచిన సర్టిఫికెట్ ( ప్రవేట్ హాస్పిటల్స్ ఇచ్చిన సర్టిఫికెట్ ) తన ప్రథమ చికిత్స కేంద్రంలో  డిస్ప్లే చేయడము, ప్రవేట్ హాస్పిటల్స్ కు, స్కానింగ్ సెంటర్లకు రెఫెర్ చేసే,రెఫరల్ స్లిప్స్ కలిగి ఉండడం, చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు,వృద్ధులకు అన్ని రకాల వయసుల వారికి, చికిత్సలు ఇవ్వడాన్ని,  అధికారులు గుర్తించారు..  అదేవిధంగా ప్రథమ చికిత్స కేంద్రంలో, బయో మెడికల్ వేస్టేజ్, ( సిరంజిలు, సూదులు, గ్లూకోజ్  బాటిల్స్, కాటన్,) బయో మెడికల్ రిజిస్ట్రేషన్ లేకుండా, బయో మెడికల్ వేస్టేజ్ ప్రాపర్ గా సెగ్రిగేషన్ చేయకుండా ఎక్కడపడితే అక్కడ వేయడం, ను అధికారులు గుర్తించారు.. ప్రథమ చికిత్స కేంద్రము నిర్వాహకుడు కేవలము ప్రథమ చికిత్సలు  నిర్వహించకుండా అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నందువల్ల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ ప్రథమ చికిత్స కేంద్రాన్ని వైద్యాధికారులు తాత్కాలికంగా మూసి వేయడం జరిగింది..


ఈ తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది కే. మధుసూదన్ రెడ్డి,i/c డిప్యూటీ డెమో, మరియు జె. నరసయ్య హెల్త్ అసిస్టెంట్ పాల్గొనడం జరిగింది..

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333