అయ్యా అధికారులారా ....డ్రైనేజీ కాలువను సరి చేయాలి
తిరుమలగిరిలోని ఏడవ వార్డులో నిర్మించనున్న డ్రైనేజ్ కాలువను సరి చేయండని అధికారులకు విన్నపం
తిరుమలగిరి 24 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని ఏడో వార్డులో డ్రైనేజీ కాలువ లోతు,వెడల్పు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని కాలనీవాసులు సంపత్ రెడ్డి ఆరోపించారు, వాస్తవంగా గత ప్రభుత్వ హాయంలో మంజూరు అయిన డ్రైనేజీ కాలువలు నేడు మరమ్మతులు చేపడుతున్నారని గత నెల రోజుల నుండి తవ్వకాలు జరిపి ఎక్కడకక్కడే వదిలివేశారు రాత్రి అయితే చిన్న పిల్లలు వృద్దులు ఆ కాలువలో పడి చనిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువను త్వరగా పనులు చేయాలని అలాగే వెడల్పు , లోతు సరిచేయాలని అన్నారు మురికి నీరు దిగువ పోవటానికి ఎత్తుపల్లాలను సరిచేయాలని చెప్పినప్పటికీ లోతుగా కాలువ తీయడం వల్ల మురికి నీరు నిల్వ ఉండే 100% అవకాశం ఉందని దోమలు పెరగడానికి ఉపయోగపడుతుందని సంపత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు