అయిజ పెదవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోతే సామూహిక ఆమరణ నిరాహార దీక్షలకైనా సిద్ధం
అయిజ అఖిలపక్ష కమిటీ హెచ్చరిక.
జోగులాంబ గద్వాల 2 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఐజ. మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న సమీకృత కూరగాయల మార్కెట్ ఆవరణలో ఐజ పెదవాగుపై బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని కోరుతూ అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘ నాయకులు, దళిత సంఘాలు, కుల సంఘాలు, రైతు సంఘాలు ఏకతాటిపై వచ్చి ఐజ పెదవాగుపై బ్రిడ్జి నిర్మించకపోతే తీవ్ర పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. గతంలో ఐజలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలలో అందరం కలిసికట్టుగా పోరాడమని అనేక విజయాలు సాధించామని ఇప్పుడు కూడా బ్రిడ్జి నిర్మించే పోరాటంలో పనిచేయుటకు సిద్ధమని తీర్మానించారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఒకే మాట ఒకే బాటగా ఈ సమస్యపై ముక్తకంఠంతో ఖండించడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఐజ ప్రజల బాధలు దృష్టిలో ఉంచుకొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. తాత్కాలిక పరిష్కారం చూప కుండా, బ్రిడ్జి పూర్తి నిర్మాణం బీటీ రోడ్డుతో సహా వేసి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని వక్తలు అధికారులకు సూచించారు. అన్ని పార్టీల నాయకులు దయచేసి బేషాజాలు వదిలి ప్రజల కోసము, బ్రిడ్జి సమస్య పరిష్కారం కొరకు ఎలాంటి పోరాటాల కైనా సిద్ధమని అఖిలపక్ష కమిటీ సమావేశంలో కమిటి పిలుపునిచ్చిoది .
ఈ సమస్య పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఆమరణ నిరాహార దీక్షకు చేయడానికి కూడా వెనుకాడమని ఈ సందర్భంగా వక్తలు తీర్మానించారు. మొదటి దశలో సమస్య తీవ్రతను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి వచ్చే సోమవారం రోజు కలెక్టర్ గారికి కమిటీ వినతి పత్రం ఇవ్వాలని కమిటి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈనెల 20వ తేది వరకు ప్రభుత్వమునకు సమయం ఇచ్చి ఆ తర్వాత ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని అఖిలపక్ష కమిటీ సభ్యులుతెలియజేశారు. కనుక ఐజ మండల ప్రజలు బ్రిడ్జి ప్రారంభం అయ్యే వరకు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.