అనుమానాస్పద స్థితిలో మహిళా మృతి

ఇది హత్య ఆత్మహత్య.....?
పురుగుల మందు తాగి వృద్ధురాలు మృతి చెందడం పణిగిరి గ్రామంలో కలకలం రేపుతోంది...!
అవమానం భరించలేక మృతి చెందింది అని చిన్న కొడుకు వాగ్మూలం...!
నాగారం 19 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెందడం గ్రామంలో కలకలం రేపుతుంది వట్టే భద్రమ్మ ముత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు మొదటి కుమారుడు వివాహం అయిన ఒక సంవత్సరంలో మరణించగా అప్పటికే ఆరు నెలల గర్భిణీగా ఉన్న పెద్ద కోడలు కు పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకొని కొంత నష్టపరిహారం చెల్లించి తన పుట్టింటికి పంపగా తాను మళ్ళీ తిరిగి 2023 సంవత్సరంలో అత్తగారింటికి వచ్చి నాకు ఆస్తిలో హక్కు ఉన్నదని వేధింపులు మొదలు పెట్టడం తో భద్రమ్మ ముత్తయ్య దంపతులు, చిన్న కుమారుడు పుల్లయ్యలు పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకొని కొంత భూమిని ఆమె పేరిట పట్టా చేసారు. కానీ ఆమె మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్భలంతో తరుచూ గొడవలకు దిగుతూ తిరిగి ఆస్తిలో నాకు సగభాగం ఇవ్వాలంటూ మమ్మల్ని తీవ్ర మనస్తపానికి గురించేస్తుందని, అంతేకాకుండా చేతికొచ్చిన వరి పంటను సైతం కోయకుండా అడ్డు పడుతుందని ఆ అవమానం భరించలేక మా అమ్మ ఆత్మహత్య చేసుకుందని మృతురాలి చిన్న కొడుకు ఆవేదన వ్యక్తం చేసాడు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు క్లూస్ టీమ్ తో వివరాలు సేకరించి, అనంతరం పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.