అధ్వానంగా మారిన మంగంపేట రోడ్డు ఇబ్బంది పడుతున్న వాహనదారులు.
జోగులాంబ గద్వాల 23 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్. మండల పరిధిలోని మంగపేట గ్రామంలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా మారింది దీంతో ఆశ వర్కర్ ప్రెగ్నెన్సీ వాళ్లను గవర్నమెంట్ హాస్పటల్ కొరకై తీసుకు వెళ్లడానికి 102 అంబులెన్స్ ని పిలవగా రోడ్డు మధ్యలోనే ఇరుకపోవడం జరిగింది .? దీంతో ఆశ వర్కర్ దగ్గర ఉండి జెసిబి ని పిలిపించుకొని 102 అంబులెన్స్ ను బయటికి లాగడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.