అడ్డగూడూరు సెక్షన్ లో విద్యుత్ సరఫరా పై రివ్యూ నిర్వహించిన భువనగిరి డిఈ వెంకటేశ్వర్లు
రైతులకు అంతరాయం లేని విద్యుత్ అందించాలని సిబ్బందికి సూచన..
అడ్డగూడూరు18 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలలోని విద్యుత్ సరఫరా పై మండల అధికారులు,సిబ్బందితో రివ్యూ నిర్వహించిన భువనగిరి డిఈ వెంకటేశర్లు అడ్డగూడూరు మండలం లోని అన్ని సబ్ స్టేషన్ పరిధిలో ప్రతి ఫీడర్ పైన ఎలాంటి ట్రిప్పింగ్స్ గాని చెట్లు,లూస్ లైన్,లేకుండా చూడాలని మరియు గ్రామాలలో కిందికి ఉన్న ట్రాన్స్ఫార్మర్ లు గుర్తించివాటిని సరి చేసి మూగ జీవాలు చావకుండా చేయాలన్నారు. సిబ్బంది కలెక్షన్ స్లాబ్, ఏజిల్ వంద శాతం చేయాలన్నారు పోల్ సర్వే త్వరతగతిన పూర్తి చేయాలి త్వరలో డి డి లు చెల్లించిన రైతులకు కాంట్రక్టర్ లు వచ్చి వైర్, పోల్స్, ట్రాన్స్ఫార్మర్ లు బిగిస్తారు అని అన్నారు రైతులకు వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిచాలని లేని యెడల సిబ్బంది పైన కఠిన చర్యలు ఉంటాయి అన్నారు.ప్రతి ఒక్కరు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం వరకు తమ తమ డిస్టిబ్యూషన్ లో ఉండాలాన్నారు ఏవైనా సమస్య లు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు వాటిని వెంటనే పరిస్కరిస్తా అని అన్నారు. సిబ్బంది కి డిపార్ట్మెంట్ కొత్త సిమ్ కార్డు లు అందిచారు ప్రతి ఒక్కరు ఇచ్చిన సిమ్ నెంబర్ లు వినియోగదారులకు తెలియజేయాలన్నారు.ప్రతి రోజు పరిస్థితి గమనించి మాకు తెలపాలని మోత్కూర్ ఏడి బాలు నాయక్,ఏఈ ఉమా కు దిశ నిర్దేశం చేశారు.ఏ చిన్న పొరపాటు జరిగిన ఆ బాధ్యత మీదే అని అన్నారు.ఈ కార్యక్రమంలో మోత్కూర్ జెఏఓ నాగేశ్వర్రావు ఏఈ ప్రభాకర్ రెడ్డి అడ్డగూడూర్ సబ్ ఇంజనిర్ వంశీ కాంట్రాక్టర్ ఉమేష్ లైన్ మెన్ లు బాలెంల దుర్గయ్య,మాలోతు వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి,ఉపేంద్రచారి, రామచంద్రయ్య, కాజా సుదర్శన్, కాంతారావు,వెంకటేశ్వర్లు,ఏఎల్ఏం వెంకటేష్ ఆర్టిజెన్ బీరప్ప పాల్గొన్నారు.అలాగే రైతులు విద్యుత్ వినియోగాదారులు ఈ క్రింది గ్రామాల లైన్ మెన్ల ఫోన్ నంబర్స్
ఏ ఈ ఉమా 8712471911, లైన్మెన్ లు బి.దుర్గయ్య 8712471941 డి రేపాక ఉపేంద్రచారి 8712471897 గట్టుసింగారం,మానయకుంట వై వెంకటేశ్వర్లు 8712471854 జానకిపురం,చిర్రగూడూర్ ఎస్ కే కాజా 8712471866 అడ్డగూడూరు టౌన్ ఏం వెంకన్న 8712471886 కంచనపల్లి, బొడ్డుగూడెం సుదర్శన్ 8712471914 ధర్మారం,లక్ష్మిదేవికాల్వ పి శ్రీనివాస్ రెడ్డి 8712471946 అజీంపేట, కొండంపేట, మంగమ్మ గూడెం గ్రామాల నంబర్లకు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలు తెలిపి పరిష్కరించు కోవాలని అడ్డగూడూరు ఏ ఈ ఉమా రైతులను కోరారు.