అడ్డగూడూరు మండల బిసి యూత్ అధ్యక్షుడిగా మార్త వెంకన్న యాదవ్
అడ్డగూడూరు 13 మే 226 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల బిసి యూత్ అధ్యక్షుడిగా మార్త వెంకన్న యాదవ్ నీ నియమిస్తూ. బుధవారం రోజు అడ్డగూడూరులోని బీసీ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య,బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్"ర్యాగ అరుణ్ కుమార్ మార్త వెంకన్న యాదవ్ నీ బీసీ యూత్ అడ్డగూడూరు మండలం అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా నూతనంగా నియమాకమైన మార్త వెంకన్న యాదవ్ మాట్లాడుతూ.. మండలంలో బీసీ సంఘం బలోపేతానికి కృషి చేస్తూ యూత్ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు.నా నియమకని సహకరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్" ర్యాగ అరుణ్ కుమార్ కి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాగోని నరేష్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.