అడ్డగూడూరు బిఆర్ఎస్ మండల నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు
అడ్డగూడూరు 8 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ ఫాంమ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నేతలు కేసిఆర్ కు చావు డప్పును కొడతమన్నందుకు బిఆర్ఎస్ పిలుపును మేరకు కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడానికి బయలుదేరిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డిని పట్టణశాఖ అధ్యక్షుడు నాగులపెల్లి దేవగిరి,మాజీ ఎంపీటీసీ పూలపెల్లి జనార్థన్ రెడ్డి లను మరియు సర్పంచ్ లు అయిన పూజారి వనజ సైదులుగౌడ్ అడ్డగూడూర్,మందుల రేణుక కిరణ్ చౌళ్ళ రామారం లను వారితోపాటు బిఆర్ఎస్ మండల యువ నాయకులు పరమేష్ గూడెపు బిఆర్ ఎస్వీ మండల అధ్యక్షుడు పయ్యావుల రమేష్, బిఆర్ఎస్ పట్టణశాఖ ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి రవి, బిఆర్ఎస్ మండల నాయకులు మెట్టు భాస్కర్ రెడ్డి, దాసరి బాలరాజు, సోమిరెడ్డి పురుషోత్తం రెడ్డి, తలపాక మహేష్, గజ్జెల్లి బాబు, గూడెపు మహేష్, బండ మత్య్సగిరి, బాకి విజయ్ కుమార్, బాకి సురేష్ తదితరులను హౌజ్ అరెస్టు చేసి స్థానిక పోలీసు స్టేషన్ తరలించి నిర్బంధించారు.