అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో సీనియర్ సిటిజన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
అడ్డగూడూరు 24 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా మండల కేంద్రంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అడ్డగూడూరులో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వయోవృద్దుల పోషణ సౌంరక్షణ అనే టాపిక్ పై వ్యాసరచన రాసిన పోటీల్లో మొదటి బహుమతి యం మధు పదవ తరగతి విద్యార్థి, రెండవ బహుమతి జి ధనశ్రీ పదవ తరగతి విద్యార్థి,మూడవ బహుమతి ఎండి అమీనా 9వ తరగతి విద్యార్థి, గెలుచుకున్నారు. గెలిచిన వారికి డిక్షనరీస్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎన్ సబిత,హెడ్మాస్టర్ పి వెంకటాద్రి,ఇతర ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక ఎంపీడీవో ఆఫీస్ లో ఇన్చార్జితో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ,స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై కే వెంకట్ రెడ్డితో డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.ఇట్టి కార్యక్రమాల్లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మండలశాఖ అధ్యక్షులు కానుగుల రాము,సెక్రటరీ బైరెడ్డి రామిరెడ్డి,ఉపాధ్యక్షులు జక్కుల యాదగిరి,ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్, మహిళ పోలీస్
సిబ్బంది.తదితరులు పాల్గొన్నారు.