అడ్డగూడూరులో ఎమ్మెల్యే సామేల్ జన్మదిన వేడుకలు
అడ్డగూడూరు 14 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:–యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ జన్మదిన వేడుకలు ఘనంగా మండల పార్టీ నాయకులు,కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలుకుతూ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం డాక్టర్"బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జన్మదిన సందర్భంగా తయారు చేసిన 10 పీట్ల కేకును కట్ చేశారు.ఆయన మాట్లాడుతూ..నా జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి నాయకులకు ప్రతి కార్యకర్తకు అభిమానులకు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.తన జన్మదిన సందర్భంగా ఉచిత వైద్య రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్వచ్ఛందంగా బ్లడ్ అందించిన వారికి పండ్లు,జ్యూస్ అందజేశారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి, బాలేoల సైదులు,మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి,తిరుమలగిరి మండల అధ్యక్షుడు సుంకరి జనార్ధన్, పి.ఎ.సి.ఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,డిసిసి ఉప అధ్యక్షులు నిమ్మనగోటి జ్యోజీ,మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బాలేoల విద్యాసాగర్, చిత్తలూరి సోమన్న,మహిళలు,వివిధ గ్రామాల సర్పంచులు,పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.