అంబేద్కర్ జయంతి  సందర్భంగా పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ 

Apr 14, 2026 - 19:41
 0  2
అంబేద్కర్ జయంతి  సందర్భంగా పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ 
అంబేద్కర్ జయంతి  సందర్భంగా పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ 

సూర్యాపేట : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాలల పేద విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ  రీజినల్ మేనేజర్ బి అనిల్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సూర్యాపేట రీజినల్ సెక్రెటరీ డి సాయిచరణ్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ సెక్రెటరీ వి అనిల్ తదితరులు పాల్గొన్నారు. 

అంబేద్కర్ జయంతి వేడుకలలో మజ్జిగ మంచినీళ్ల ప్యాకెట్ల పంపిణీ 

అంత ముందు స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమంలో వచ్చిన వారందరికీ ఎస్బిఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సూర్యాపేట రీజియన్ ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్ల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని కే లత లాంచనంగా ప్రారంభించి మజ్జిగ, మంచినీళ్లు ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ విధంగా ఎస్ సి ఎస్ టి ఎస్ బి ఐ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సూర్యాపేట రీజియన్ వారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం హర్షనీయమని, అభినందించదగ్గ విషయమని పలువురు ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఎస్బిఐ ఎస్సీ, ఎస్టీ  ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున చేపట్టనున్నట్లు సూర్యాపేట రీజినల్ సెక్రటరీ డి సాయి చరణ్ వెల్లడించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333