అంగరంగ వైభవంగా కమలాపురం గ్రామంలో సేవాలాల్ జయంతి ఘనంగా జరిపిన బంజారా నాయకులు

Feb 15, 2026 - 17:50
 0  0
అంగరంగ వైభవంగా కమలాపురం గ్రామంలో సేవాలాల్ జయంతి ఘనంగా జరిపిన బంజారా నాయకులు

 బంజారా తండాలలో సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పోరిక గోవింద నాయక్

మంగపేట,తెలంగాణ వార్త న్యూస్,ఫిబ్రవరి :15 మంగపేట మండలం కమలాపురం గ్రామంలో బంజారా పెద్దలు నాయకుల ఆధ్వర్యంలో మహిళలు బంజారా ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున నిర్వహించారు.సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ములుగు మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ మాట్లాడుతూఈ రోజు మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో గౌరవంగా ఆనందంగా ఉంది. సేవ త్యాగం నీతి నిజాయితీ అనే విలువలను సమాజానికి బోధించిన మహనుభావుడు సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆయన ఒక మార్గదర్శకుడు ఆధ్యాత్మిక దిక్సూచి.సేవాలాల్ మహారాజ్  సమాజంలో ఐక్యత సమానత్వం సోదరభావం పెంపొందించేందుకు కృషి చేశారు. ఆయన బోధనలు మనందరికీ ఆదర్శం సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం ఆయన చూపిన మార్గంలో నడవాలి. ములుగు జిల్లాలో ప్రతి తండాల్లో ఒక సేవాలాల్ మహారాజ్ స్థల సేకరణ చేసి గుడి నిర్మించాలని దానికి ప్రభుత్వం సహకరించాలని పోరిక గోవింద నాయక్ డిమాండ్ చేశారు.మన యువత సేవా భావంతో ముందుకు రావాలి విద్య క్రమశిక్షణ, ఐక్యత ద్వారా సమాజాన్ని అభివృద్ధి పరచాలి. సేవాలాల్ మహారాజ్  ఆశయాలను నిలబెట్టడం మన బాధ్యత. సేవాలాల్ మహారాజ్ కి మన ఘన నివాళులు అర్పిస్తూ పెద్ద ఎత్తున కమలాపురంలోని బంజారా సోదర సోదరీమణులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  గుగులోతు రాజు నాయక్ ఇస్లావత్ రాజు ఇంగ్రీ నాయక్ పోరిక సమ్మయ్య అజ్మీరా రాజు బాదావత్ శ్రీహరి  భూక్య రవి భూక్య సంపత్ కుమార్ భూక్య నాయక్ గూగులోత్ సమ్మక్క గుగులోతు తిరుపతమ్మ భూక్య రవి అజ్మీర నరసయ్య తుక్కని శ్రీనివాస్ గూడూరు సత్యం యలవర్తి శ్రీనివాసరావు లకావత్ చందూలాల్ పగడాల వెంకట్ రెడ్డి గోమాస చందర్రావు తదితర బంజారా నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333