అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ కు సకాలంలో వేతనాలు చెల్లించాలి 

Jun 8, 2026 - 19:56
 0  23
అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ కు సకాలంలో వేతనాలు చెల్లించాలి 

 ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ కేంద్రాలను తక్షణమే రద్దు చేయాలి 

సీఐటీయూ డిమాండ్ .

 జోగులాంబ గద్వాల 8 జూన్ 2026తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల.  : ఐసిడిఎస్ లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కు ప్రతినెలా ఒకటవ తేదీన వేతనం ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు అనుబంధం) జిల్లా కార్యదర్శి ఏమెలమ్మ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మదన్మోహన్ కి, డీఈఓ విజయలక్ష్మి కి, డిడబ్ల్యుఓ సునంద కి వినతి పత్రాలు అందజేశారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గర్భిణీలకు స్త్రీలకు విశేషమైన సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కు సకాలంలో వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిజేయడం సరైనది కాదన్నారు.వేతనాలు సకాలంలో రాక, ఎప్పుడొస్తాయో స్పష్టత లేక అంగన్వాడీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్ ఈ పి -2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో తెచ్చిన 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, ప్రీ ప్రైమరీ పిఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే కొనసాగించడం ద్వారా ఐసిడిఎస్ రక్షణతో పాటు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ కేంద్రాలను తక్షణమే రద్దుచేసి ఈ కేంద్రాలను అంగన్వాడీలకు అప్పగిస్తూ ప్రభుత్వం వెంటనే నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ఐసిడిఎస్ పరిరక్షణ కోసం తాము పోరాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు చిన్నారులకు పౌష్టికాహారాన్ని దూరం చేసే పద్ధతుల్లో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. కావున తక్షణమే ప్రీ ప్రైమరీ పీఎం కేంద్రాలను రద్దుచేసి, ప్రతి నెల ఒకటవ తేదీన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఖాతాలో వేతనం జమ ఏ విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉప్పేర్ నరసింహ, వివి నరసింహ అంగన్వాడీ టీచర్స్ శాంతమ్మ,అరుణ, జ్యోతి,సుమలత,భారతి,రూపప్రియ, పుష్పావతి,నాగేంద్రమ్మ, బీయమ్మ, సుమలత వరలక్ష్మి,
హెల్పర్స్ మునెమ్మ,భాగ్యమ్మ  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333