సైన్స్ పై మక్కువ పెంచుకోవాలి

Jan 31, 2025 - 21:04
Feb 1, 2025 - 08:35
 0  14
సైన్స్ పై మక్కువ పెంచుకోవాలి

సైన్స్ పై మక్కువ పెంచుకోవాలి

ఎంఈఓ తేజావ త్ వెంకటేశ్వరరావు

వాజేడు తెలంగాణ వార్త జనవరి 31:- విద్యార్థులు సైన్స్ పై మక్కువ పెంచుకోవాలని వాజేడు మండల విద్యాధికారి తేజావత్ వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం వాజేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (ఎఫ్.పి.ఎస్.టి) ఫోరమ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఆధ్వర్యంలో జరిగిన భౌతిక రసాయన శాస్త్ర పరీక్షలో బహుమతులు పొందిన విద్యార్థులను వెంకటేశ్వరరావు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనందరావు లు అభినందించారు.

ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిజ జీవితంలో సైన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని సైన్స్ పై మక్కువ పెంచుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వెంకటేశ్వరరావు అన్నారు. 

 ప్రధానోపాధ్యాయులు ఆనందరావు మాట్లాడుతూ రాబోయే కాలమంతా శాస్త్ర సాంకేతికథ పైనే ఆధారపడి ఉంటుందని అందుకనే విద్యార్థులు ఇప్పటినుంచే సాంకేతిక అంశాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని విద్యార్థులకు తెలియజేశారు గతంలో పరీక్షలు అంటే పెన్ను పేపర్ విధానం ఉండేదని ప్రస్తుతం ఆన్లైన్ ద్వారానే పరీక్షలు జరుగుతున్నాయని ఆన్లైన్ విధానానికి విద్యార్థులు జంకకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహించిన భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ పరీక్షలో ప్రధమ బహుమతి రుద్ర రోషిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాజేడు నాగారం, ద్వితీయ బహుమతి జి. దీప్తిక ఎ జీ హెచ్ఎస్ పెద్ద గొల్లగూడెం, తృతీయ బహుమతి ఏ. ఐశ్వర్య కేజీబీవీ వాజేడు లను మండల విద్యాధికారి మరియు ప్రధానోపాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో స్వరూప్ సింగ్, ఆనంద్, రవి కుమార్, కుమార్ బాబు, రాజేష్, రోజారాణి, నాగలక్ష్మి, వెంకటేశ్వర్లు, నర్సింగరావు, ఈశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్