సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం
సీజనల్ వ్యాధుల పై అవగహన కార్యక్రమం
తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి;- తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందు వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం పాల్గొని సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థి నిలకు జాగ్రతలు తీసుకోవాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.వర్ష కాలంలో వర్షాలు పడడం వలన మన కళాశాల పరిసరాలలో నీరు నిల్వ ఉండడం వలన దోమలు స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అవి కుట్టడం వలన మలేరియా,ఫైలేరియా, మెదడు వాపు,డెంగ్యూ,చికెన్ గున్యా వ్యాధి గ్రస్తుల నుండి ఒకరి నుండి మరొకరికి కుట్టి వ్యాప్తి చేస్తాయని, ముఖ్యంగా ఈ వర్ష కాలంలో నీరు కలుషితం కావడం వలన,కలుషితమైన ఆహారం పదార్థాలు , ఈగలు వాలిన ఆహార పదార్థాలు తినడం వలన , టైఫాయిడ్,నీళ్ల విరేచనాలు,బంక విరేచనాలు, కలరా సంభవించే అస్కారం ఉన్నందున వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, నీళ్ళు కాచి వడబోసి త్రాగాలని, హ్యాండ్ వాష్ పై అవగాహణ కల్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మణిరత్నం, PHN సైదమ్మ, ఆరోగ్య కార్యకర్త హేమలత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీలా,కళాశాల అధ్యాపకులు,విద్యార్థినిలు పాల్గొన్నారు*