సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించాలి.

Nov 5, 2024 - 20:30
Nov 5, 2024 - 20:33
 0  4
సమగ్ర ఇంటింటి  కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించాలి.

తెలంగాణ వార్త 05.11.2024.సూర్యాపట జిల్లా ప్రతినిది:- సూర్యాపేట మున్సిపల్ కమిషనర్  కమిషనర్ బోళ్ల శ్రీనివాస్ సూర్యాపేట .సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బోళ్ల శ్రీనివాస్ తెలిపారు. మున్సిపల్ సమావేశం మందిరంలో ఎన్యూమరేటర్ల కు సూపర్ వైజర్ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న సర్వే లో భాగంగా ఇంటి వద్ద కు వచ్చే ఎన్యూమరేటర్ కు సరైన సమాచారం అందించి పట్టణభివృద్ధికి సహకరించి సర్వేను విజయవంతం చేయాలని కోరారు. కుటుంబ గణన కూడా పట్టణంలో పూర్తి అయిందన్నారు. ఇప్పటికి గృహలకు స్టిక్కరింగ్ తో పాటుగా గృహ యజమానుల పేర్లు కూడా నమోదు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. సర్వే కు తమ ఇళ్ల వద్ద కు రాకుంటే సమాచారం ఇవ్వాలన్నారు. కుటుంబ సభ్యుల సర్వే ఈనెల 9న ప్రారంబం అవుతున్నట్లు తెలిపారు. 285 ఎన్యూమరేషన్ బ్లాక్ లకు గాను 260 మంది ఎన్యూమరేటర్లు, 30మంది సూపర్ వైజర్ లు విధుల్లో ఉండి 39800 గృహలను సర్వే చేయనున్నట్లు తెలిపారు  సమావేశం లో ఈ ఈ కిరణ్, డీలింగ్ అసిస్టెంట్ గోపారపు రాజు, మాస్టర్ ట్రైనర్ శ్రీధర్ రెడ్డి, వార్డు అధికారులు మున్సిపల్ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223