వినియోగదారుల మన్ననలు పొందాలి: మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి
*వినియోగదారుల మనలను పొందాలి*
*సూర్యాపేట **
నాణ్యత ప్రమానలు పాటిస్తూ వినియోగదారుల మన్ననలను పొందాలని మాజీ మంత్రి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు *రాo రెడ్డి దామోదర్ రెడ్డి* అన్నారు . గురువారం జిల్లా కేంద్రంలోని 14 వ వార్డు కుడకుడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన *మహంకాళి గ్రాండ్, వెజ్, నాన్ వెజ్ ,మల్టీ రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించి మాట్లాడారు. హోటల్ నిర్వాహకులు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించాలన్నారు. నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో నచ్చిన రంగంలో రాణించేలా దూసుకుపోతున్నారని కొనియాడారు. పెద్దపెద్ద నగరాలకు, పట్టణాలకు దీటుగా సూర్యాపేట జిల్లా పోటీ పడుతుందని అన్ని సౌకర్యాలతో జిల్లా కేంద్రంలోని దుకాణాలు, మాల్స్, హోటల్స్, ఏర్పడడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేనారెడ్డి ,డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, హోటల్ నిర్వాహకులు మహంకాళి బాలకృష్ణ, మహంకాళి శివ, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి ,నాగుల వాసు, కోతి గోపాల్ రెడ్డి, గుర్రం ప్రకాష్ రెడ్డి, నాగయ్య, సురేష్, ఎస్ కే షరీఫ్ ,భరత్, ఉప్పి, శ్రీకాంత్ నాయకులు పాల్గొన్నారు