విద్యా సౌకర్యాలు, సానుకూల దృక్పథం, బోధనాభ్యసన ప్రక్రియ
విద్యా సౌకర్యాలు, సానుకూల దృక్పథం, బోధనాభ్యసన ప్రక్రియ, తపన మెరుగైన విద్యా వ్యవస్థకు కీలకoశాలు. సబ్జెక్టులపై వ్యక్తిగత ఇస్టా ఇష్టాలు ప్రధానం కాదు.ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు బాధ్యత గుర్తించి వ్యవహరించాలి ------
స్వాతంత్ర్య సమరయోధులు హర్ దయాల్ మాథుర్.
--- వడ్డేపల్లి మల్లేశం
ప్రపంచవ్యాప్తంగా విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించిన అనేక దేశాలు ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తుంటే భారతదేశంలో మాత్రం చేసిన సిఫారసులను ధిక్కరించి విద్య ప్రభుత్వ రంగం కంటే ప్రైవేట్ రంగంలోనే ఎక్కువగా కొనసాగు తున్న కారణంగా సామాన్య ప్రజానీకం కూడా ప్రైవేటు పాఠశాలల వెంట పరిగెడుతూ తమ అస్తిత్వాన్ని విజ్ఞానాన్ని విద్యారంగ ప్రయోజనాలను కోల్పోతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 1966 లో కొఠారి కమిషన్ కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని,దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా 10 శాతం 30% నిధులను విద్యారంగానికి కేటాయించడం ద్వారా తమ సామాజిక బాధ్యత నిర్వహించాలని చేసిన సూచనలు సిఫారసులు సుమారు 60 సంవత్సరాలుగా బుట్ట దాఖలు అవుతూనే ఉన్నాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడు కూడా ఇప్పటివరకు ఆ సిఫారసులు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతాయని మాత్రం అంగీకరించిన దాఖలా లేదు .ఈ క్రమంలోనే అనేకమంది మేధావులు బుద్ధి జీవులు భారతదేశంలో విద్యాసంస్కరణలకు కోరు కోవడం ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా మెరుగైన సిఫారసులు చేసినప్పటికీ అదే సందర్భంలో విద్యా పరిరక్షణ కమిటీల పేరుతో ప్రభుత్వ రంగంలో విద్యను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు నిర్వీర్యం అవుతున్నాయి పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా.
నైతిక విలువలు పునాదిగా గల పాఠ్యాంశాలతో పాటు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగల సిలబస్ ఉండాలని అనేక రకాలుగా ఒత్తిడి వస్తున్నప్పటికీ ప్రధానంగా వ్యవసాయక దేశమైన భారతదేశంలో ఆ రకమైనటువంటి సిలబస్ లేకపోవడం పైన కొందరు ఆక్షేపిస్తున్నారు కూడా .జాతి అవసరాలను తీర్చి ప్రజలను ప్రయోజకులుగా చేయవలసినటువంటి విద్య కేవలం తరగతులను మార్చడానికి, విద్య నేర్చుకున్న వాళ్లు మళ్లీ తరగతిలో బోధించడానికి మాత్రమే పనికి వస్తున్నదని ఇది విద్య యొక్క లక్ష్యం నెరవేరినట్లు కాదని అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో గమనిస్తే ముఖ్యంగా కేరళ రాష్ట్రం విద్య పైన శ్రద్ధతోపాటు 24% గా బడ్జెట్లో నిధులను కేటాయించడం ద్వారా సామాజికంగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఇతర రాష్ట్రాలకు కేంద్రానికి ఆదర్శంగా నిలబడింది కూడా. అంతెందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం కాలంలో కూడా 17% నిధులను కేటాయిస్తే ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆరు ఏడు శాతం దా టకపోవడం ఒక అంశం అయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో గతంలో కేజరీవాల్ పాలించిన కాలం లోపల 25% నిధులను కేటాయించడం ద్వారా ప్రైవేట్ రంగంలో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ రంగంలోకి స్వాగతించిన తీరు భారతదేశానికి ఆదర్శం. అక్కడ ఆ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే కనుమరుగయిందో అలాంటి ఛాయలు మచ్చుకు కూడా కనబడడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయి శిక్షణతో పాటు వసతులను భారీగా ఏర్పాటు చేయడం వల్లనే అది సాధ్యమైందని అంతకుమించిన స్థాయిలో చిత్తశుద్ధి ప్రధానంగా తోడ్పడిందని గత పాలన పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది .అందుకే విద్యారంగ పరిస్థితులను, ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క సామాజిక బాధ్యతలను, సిలబస్ పైన విద్యార్థుల యొక్క తపనపైన లోతుగా స్పందించినటువంటి విద్యావేత్త భారతదేశపు స్వాతంత్ర సమరయోధులు హర్ దయాళ్ మాతుర్ చేసిన హెచ్చరిక ఈ సందర్భంగా ప్రస్తావించుకోవడం ద్వారా విద్యారంగ పరిస్థితులు మెరుగుపరచుకోడానికి కొంతవరకైనా తోడ్పడుతుంది.
స్వాతంత్ర యోధులు హర్ దయాల్ మాథుర్ మాటల్లో
2026 ఫిబ్రవరి మాసాంతంలో ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ముఖ్యమంత్రి గారికి అందించిన సిఫారసుల నివేదిక కొంత వివాదాస్పదము కాగా విద్యారంగంలో రావలసిన మౌలిక అంశాల పైన స్పందించక పోగా ఉపాధ్యాయులకు వ్యతిరేకమైన సిఫారసులు చేసినట్లు దు మారము రేగుతున్న వేళ నాడే విద్యారంగాన్ని సమగ్రంగా నిర్వచించి విశ్లేషించిన స్వాతంత్ర సమరయోధులు హారదయాళ్ మాతూర్ అభిప్రాయాన్ని పరిశీలించడం చాలా అవసరం. వారి మాటల్లో " మనలో చాలామంది ఏదో ఒక సబ్జెక్టును ఇష్టపడరు కొందరికి చరిత్ర బోరు కొడితే మరికొందరికి లెక్కలు విసుగు అనిపిస్తాయి .నిజానికి లోపం సబ్జెక్టుది కాదు దాన్ని అర్థం చేసుకోవడంలో మన ప్రయత్నాన్ని ది. సరైన ఉపాధ్యాయుడు సానుకూల దృక్పధము ఉంటే ఏ సబ్జెక్టు కూడా విసుగు అనిపించదు".
ఈ మాటల్లో కేవలం సబ్జెక్టుల గురించి చెప్పినంత మాత్రాన పరిమితం చేయడానికి వీలు లేదు. విద్యా రంగం యొక్క వైఫల్యం, పాలకుల యొక్క నిర్లక్ష్యం, అనాదిగా చేసిన సూచనలను పాటించకపోవడం, సానుకూల దృక్పథంతో పాటు ఉపాధ్యాయులు పాలకుల్లో చిత్తశుద్ధి కొరబడుతుండడం వలన ఈ దుస్థితి దాపురించిందని సబ్జెక్టుల మీద నిర్లక్ష్యం అపోహ ఇష్టం లేకపోవడం అనేది విద్యా రంగంలో సమస్య కానే కాదని వీరి వాదన ద్వారా తెలుస్తున్నది. పాలకులు ఎప్పుడూ కూడా తమ వైఫల్యాలను ప్రజల బలహీనతల మీద వేసే ప్రయత్నం చేస్తారని మొక్కుబడిగా ప్రభుత్వాలు నియమిస్తున్నటువంటి కమిటీలు లేదా కమిషన్ల యొక్క సిఫారసులు కూడా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండడం కారణంగా ప్రైవేటు రంగం వి లసిల్లుతూ ప్రభుత్వ రంగం కు నారి ళ్ళి పేద మధ్యతరగతి అట్టడుగు వర్గాలకు విద్య అంద కుండా పోతున్నది. ఈ పరిస్థితుల్లో అనివార్యమైన వేల లక్షలాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ ప్రైవేట్ రంగంలో చదివించడం వలన చివరికి ప్రభుత్వ రంగం పైన ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరూ లేకుండా పోతున్నది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులతో సహా అందరూ కూడా విమర్శకు గురవుతున్న మాట వాస్తవం.అయితే దానికి పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహించవలసి ఉంటుంది .ఆ వైఫల్యాల కారణంగానే తమ పిల్లలు నాణ్యమైన విద్య చదువుకోవాలని స్వార్థం ఆశతోనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇతర సంపన్న వర్గాలు కూడా ప్రైవేట్ రంగం లోని పాఠశాలల కు పంపించడం వల్ల ప్రైవేట్ రంగమే చట్టబద్ధమైపోయింది. ఇంత దుర్మార్గమైనటువంటి దయనీయ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వ రంగంలోనే తప్ప ప్రైవేట్ రంగంలో విద్యను కొనసాగించడానికి వీలు లేకుండా చట్టాలు చేసి పాలకులు తమ చిత్తశుద్ధిని చాటుకున్నప్పుడే పరిష్కారం దొరుకుతుంది.చిత్తశుద్ధి ఉంటే కమీషన్లు అవైపుగా సిఫారస్ చేయాలి. ప్రభుత్వాలు సామాజిక బాధ్యతతో విద్యను వ్యాపారంగా చూడకుండా ప్రజాచైతన్య శక్తిగా గుర్తించాలి. అప్పుడే మనం ప్రపంచంతో పోటీ పడినట్లు.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )