రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు..

Mar 23, 2026 - 18:18
Mar 23, 2026 - 19:44
 0  0
రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు..
రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు..

సూర్యాపేట పట్టణంలో ఆపరేషన్ రోప్ ROPE - Removal of Obstructive Parking and Encroachments. స్పెషల్ డ్రైవ్.

సూర్యాపేట, 24 మార్చి 2026 తెలంగాణవార్త విలేఖరి:- జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలో ప్రజల, వాహనదారుల సౌకర్యార్థం సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి "ఆపరేషన్ రోప్" కార్యక్రమం చేపట్టడం జరిగినదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం అన్నారు. దీనిలో భాగంగా ఈరోజు కూరగాయ మార్కెట్ రోడ్డు లో ఉన్న ఆక్రమణలను మున్సిపాలిటీ అధికారులతో కలిసి తొలగించారు. అలాగే రోడ్డు పై ఉన్న మట్టి కుప్పలు, చెత్తను, రాళ్ళను తొలగించి రోడ్డు సక్రమంగా కనిపించేలా వినియోగించేలా చేశారు. ముఖ్య పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి, ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలు జరగకుండా చేయడం, ఆక్రమణలు, అనధికారిక పార్కింగ్ తొలగించడం, వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లడం అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో ఆపరేషన్ రోప్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333