చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్రఉపాధ్యక్షులు వనం ఉపేందర్
రామన్నపేట 22 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 25 న ఇందిరాపార్క్ దగ్గర జరుగు మహా ధర్నా జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం ఉపేందర్ పిలుపునిచ్చారు రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పోస్టర్ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వనం ఉపేందర్ మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా సాధించుకున్న పథకాలైన జాతీయ చేనేత బోర్డు, హాండిక్రాఫ్ట్ బోర్డు, మహాత్మా గాంధీ బునకర్ భీమా యోజన, ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ స్కీమ్, హౌస్ కమ్ వర్క్ షెడ్ పథకాలను అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రద్దు చేసిందని, కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ ముడి సరుకులైన రంగులు, రసాయనాలతో పాటు చేనేత చీరలపై జి యస్ టి విధించి దేశ వ్యాప్తంగా చేనేత పరిశ్రమను చావు దెబ్బ తీసిందని ఆరోపించారు.మన తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికయిన కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్న రుణమాఫీ చేస్తానని ప్రకటించి ఏడాదిన్నర తరువాత తెలంగాణా చేనేత కార్మిక సంఘం పోరాటాల ఫలితంగా ఋణమాఫీ అమలు అయ్యింది. పేరు ఏదైనా గత ప్రభుత్వం అమలు చేసిన నేతన్న భరోసా పథకం అమలు చేయకుండా, త్రిఫ్ట్ పథకంలో చేనేత కార్మికులు డిపాజిట్ చేసినా రెండు నెల లే వేసి మిన్నకుండి పోయింది. జియోటాగ్ ఉండి మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు సంవత్సరం దాటినా నేటికీ నేతన్న భీమా, ఎక్స్రేషియా రాలేదు. స్వాతంత్య్రంనకు స్ఫూర్తి నిచ్చిన సహకారోద్యమం తుంగలో తొక్కి 13 సంవత్సరాల నుండి ఎన్నికలు నిర్వహించకుండా చేనేత పారిశ్రామిక సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేయకుండా తాళాలు వేసే దారుణమైన స్థితికి తెచ్చి చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది చేనేత కార్మికుల కుటుంబాలను వీధుల పాళేస్తూ వ్యవహరిస్తున్నదని అనేక సంధార్భాలలో అనేక పర్యాయాలు తెలంగాణ చేనేత కార్మిక సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి చర్చలు జరిపినా పథకాలకు డబ్బులు కేటాయించకుండా చేనేత పరిశ్రమ, చేనేత కార్మికుల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. జియోటాగ్ ఉన్న చేనేత కార్మికులందరికి ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకంలో జియో టాగ్ ఉన్న కార్మికుడికి నెలకు 2000/- రెండు వేలు అనుబంద కార్మికులు ఇద్దరికి 500/- చొప్పున మొత్తం 36,000/-రూపాయలు అంద చేయాలి.చేనేత కార్మికులకు అమలు చేస్తున్న త్రిఫ్ట్ పథకంలో చేనేత కార్మికులు నెలల నుండి రికరింగ్ డిపాజిట్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం రెండు నెలలు మాత్రమే డిపాజిట్ చేసి మళ్ళీ వేయలేదు. బకాయి ఉన్న రూపాయలను వెంటనే డిపాజిట్ చేయాలి.2026-27 రాష్ట్ర బడ్జెట్ లో చేనేతకు రెండు వేల కోట్ల రూపాయలు టెక్స్ టైల్స్‌కు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరణించిన చేనేత కార్మికులకు త్రిఫ్ట్ పథకంతో షరతులు లేకుండా, నేతన్న భీమా, ఎక్స్రేషియా తక్షణం 60సంవత్సరాలు పైబడినవారికి అందజేయాలి. చేనేత పారిశ్రామిక సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ ఋణాలను మాఫీ చేయాలి.
క్యాష్ క్రెడిట్ ఋణాలను పునరుద్ధరించాలి.గత 13 సంవత్సరాల నుండి ఎన్నికలు నిర్వహించకుండా ఉన్న చేనేత పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి, టెస్కో (TSCO)కు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలి.జియో టాగ్ వేసి ఉన్న మిగత చేనేత కార్మికులకు త్రిఫ్ట్ పథకం అమలు చేయాలి.అర్హులైన చేనేత కార్మికులకు వేస్తున్న జియో టాగ్ నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. చేనేత కార్మికులకు అయిదు లక్షల (5,00,000-00) వరకు ఆరోగ్య భీమా సదుపాయం కల్పించాలి. చేనేత కార్మికులకు ఇంటి స్థలంతో బాటు హౌస్ కమ్ వర్క్ షెడ్ లను ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా చేనేత కార్మికులకు వేతనాలను పెంచి అమలు చేయాలి.చేనేత కార్మికులకు పెట్టుబడి సాయం కింద రాయితీతో జీరో వడ్డీతో కొత్త ఋణాలు 5 లక్షలు ఇవ్వాలి.చేనేత కార్మికుల, సహకార సంఘాల వద్ద పేరుకు పోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి.కార్మికులకు ఉపాధి కల్పన కోసం టెండర్ వేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు ఏక రూప దుస్తులను చేనేత వస్త్రాలనే అందించాలి
గతంలో రేషన్ షాపుల ద్వారా జనతా వస్త్రాలు అందించినట్లుగా చేనేత వస్త్రాలైన చీర, ధోవతి, లుంగీ అందించాలి.చేనేత వస్త్రాల పైన, ముడి సరుకులైన నూలు, రంగులు, రసాయనాలపై జీఎస్టీ ఇత్వేయాలని. డిమాండ్ చేయడం జరిగింది. ఈనెల 25న ఇంద్ర పార్క్ వద్ద జరిగే మహా ధర్నాను భువనగిరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వెల్లంకి గ్రామ నాయకులు పున్న దత్తాద్రి ఈపూరి సత్యనారాయణ అంకం నరసింహ అంకం మురళి పున్న రాఘవేంద్ర గుర్రం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.