మైనర్ల కు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులు
సాయంత్రం నాలుగు దాటింది అంటే 60 ఫీట్ల రోడ్డులో రుయ్ రుయ్మంటూ బైకుల హంగామా
మైనర్లకు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులు తస్మాన్ జాగ్రత్త ఇటీవల కాలంలో యాక్సిడెంట్ లో మరణిస్తున్న వారిలో మైనర్ లు ఎక్కువగా బైక్ యాక్సిడెంట్లకు గురవుతున్నారు. తల్లిదండ్రులు గమనించి మైనర్లకు బైకులు ఇవ్వద్దని పోలీసులు పదేపదే చెప్తున్న 60 ఫీట్ల రోడ్ లో 4:30 సమయం నుంచి ఎనిమిది గంటల సమయం వరకు మైనర్ల ఆకతాయిలు తట్టుకోలేక పోతున్నారని 60 ఫీట్ల రోడ్ల షాప్ ల యజమానులు, స్కూల్ పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో పోలీసులు ఎన్నిసార్లు నిఘా ఏర్పాటు చేసిన బైకులకు నెంబర్ ప్లేట్ తీసేసి ఇలాంటి ఘటనలు రోజు జరుగుతున్నాయి.పోలీసులు ఈ విషయాన్ని గమనించి నిఘా ఏర్పాటు చేసిన పోలీసుల కల్లుగప్పి ఆకతాయిల ఆగడాలు తప్పడం లేదు.తల్లిదండ్రులు ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలకు బైకులు ఇవ్వకపోతే మంచిదని ప్రజలు వాపోతున్నారు. అలాగే పోలీసు వారు కూడా ఈ విషయంపై స్పందించాలని ప్రజానీకం కోరుతున్నారు