మచ్చా దత్తా రెడ్డిని రిటైన్ చేసుకున్న తుంగభద్ర వారియర్స్ జట్టు 

Apr 25, 2026 - 17:34
Apr 25, 2026 - 17:34
 0  0
మచ్చా దత్తా రెడ్డిని రిటైన్ చేసుకున్న తుంగభద్ర వారియర్స్ జట్టు 

- ఏపీఎల్ వేదికపై బ్యాటు తో మళ్ళీ మెరిసేందుకు సిద్ధమవుతున్న  మచ్చా దత్తా రెడ్డి
 
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం మంగళగిరి కడప పట్టణాల్లో జూన్ నెలలో నిర్వహించనున్నఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్‌కు ముందు జరుగుతున్న రిటెన్షన్ ప్రక్రియలో తుంగభద్ర వారియర్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది విజేత జట్టు తుంగభద్ర  వారియర్స్ యాజమాన్యం కొంతమంది క్రికెటర్లను రీటైన్ చేసుకుంది గత ఏడాది తుంగభద్ర వారియర్స్ జట్టు విజేతగా నిలిచేందుకు వికెట్ కీపింగ్ బ్యాటింగ్లో అద్భుతంగా రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించినఅనంతపురం జిల్లాకు చెందినజట్టు నమ్మకమైన ఓపెనింగ్ బ్యాటర్, అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ మచ్చా దత్తా రెడ్డి ని 2026 క్రికెట్ సీజన్ కు వచ్చే సీజన్‌కు కూడా రిటైన్ చేసుకుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏ పీ ఎల్ గవర్నింగ్  బాడీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ తుంగభద్ర వారియర్స్ జట్టు యజమాన్యం లేఖ రాసింది ఈ నిర్ణయంతో వారియర్స్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. రేపు ఆదివారం 26 ఉదయంవిశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెటర్ల వేలంపాట జరగనుంది ముందుగా ప్రతి జట్టు 5 మంది క్రికెటర్లను రీటైన్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర క్రికెట్ సంఘం కల్పించింది అందులో గత ఏడాది ఆడిన వారిలో మచ్చా దత్త రెడ్డి జ్ఞానేశ్వర్ రోహిత్  సౌరబ్ కుమార్ దీపక్ లను ఐదు మంది క్రికెటర్లనురిటైన్ చేసుకుంటూ తుంగభద్ర వారియర్స్ జట్టు యాజమాన్యంఆంధ్ర క్రికెట్ సంఘానికి లేఖ రాసింది

 సీనియర్స్ క్రికెట్అంతర్ జిల్లాల వేదికపై సత్తా.. 

క్రికెట్ ప్రేమికులకు సుపరిచితుడైన మచ్చా దత్తా రెడ్డి తన సమర్థతను ఇప్పటికే అంతర్జిల్లా సీనియర్ క్రికెట్ వేదికపై నిరూపించుకున్నారు. ఇటీవల కడపలో జరిగిన వన్డే టోర్నమెంట్‌లో 4 మ్యాచ్‌లలో 187 పరుగులు, టీ20 పోటీల్లో 4 మ్యాచ్‌లలో 105 పరుగులు చేసి అనంతపురం జట్టు విజయానికి వెన్నెముకగా నిలిచారు. ఓపెనింగ్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా ఆయన ప్రదర్శించిన రెండు పాత్రల సమన్వయం జట్టు తుంగభద్ర వారియర్స్ జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకుంది.

 అండర్-16 నుంచి రంజీ వరకు అద్భుత ప్రయాణం.. 

మచ్చా దత్తా రెడ్డి ప్రతిభ కేవలం సీనియర్ స్థాయికే పరిమితం కాలేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే అన్ని విభాగాలలో ఆంధ్ర జట్టుకి ఎంపికయ్యారు అన్ని విభాగాల్లో రాష్ట్ర జట్టు ప్రాతినిధ్యం వహించి అనేకసార్లు అద్భుత ప్రతిభతో ఆంధ్ర జట్టుని గెలిపించారుఅండర్-12 16, 19, 23, 25 విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఎంపికై పలు విజయాలను అందించారు. అండర్ 19 జాతీయ క్రికెట్లో అద్భుత ప్రతిభ కనబరిచి నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ శిక్షణ పొందారుఅంతేకాదు — దేశీయ క్రికెట్‌లో అత్యున్నత వేదికగా పరిగణించే రంజీ ట్రోఫీ జట్టులో కూడా స్థానం దక్కించుకున్న ఘనత ఆయనది. యువతరానికి స్ఫూర్తిప్రదమైన ఈ ప్రయాణం ఏపీఎల్ వేదికపై మరింత వెలుగు చూడనుంది.
 వారియర్స్ శిబిరంలో విశ్వాసం..

గత ఏడాది ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతతుంగభద్ర వారియర్స్ జట్టుయాజమాన్యం ఈ నిర్ణయంపై స్పందిస్తూ మచ్చా దత్తా రెడ్డి మా జట్టుకు అమూల్యమైన ఆస్తి. ఆయన అనుభవం, క్రీజులో స్థిరత్వం మా బృందానికి ఎంతో బలాన్నిస్తాయి. ఈ సీజన్‌లో ఆయన మరింత ప్రకాశిస్తారని నమ్మకంగా ఉన్నాం అని పేర్కొంది.

 సీజన్‌పై పెరిగిన అంచనాలు..

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏ పీ ఎల్ ఐదవ సీజన్ త్వరలో మంగళగిరి విశాఖపట్నం కడప పట్టణాల్లో ప్రారంభం కానున్నదిమచ్చా దత్తా రెడ్డి రిటెన్షన్ నేపథ్యంలో వారియర్స్ శిబిరంలో మరింత ఉత్సాహం నెలకొంది. అంతర్జాతీయ నాణ్యమైన స్థాయి ప్రదర్శన చేయగల ఓపెనర్, నమ్మకమైన వికెట్ కీపర్ జట్టులో కొనసాగడం ఈ సీజన్‌లో తుంగభద్ర వారియర్స్ అవకాశాలను మరింత బలపరుస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీఎల్ వేదికపై మచ్చా దత్తా రెడ్డి బ్యాటు మళ్ళీ మెరిసేందుకు సిద్ధమైందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333