మానవ అక్రమ రవాణా చేయవద్దు ఆపాలి
మానవ అక్రమ రవాణా చేయవద్దు ఆపాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎస్సై పెరిక రవీందర్
*తెలంగాణ వార్త , పెన్ పహాడ్..మండలం
మానవ అక్రమ రవాణా చేయడం నేరమని అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై పెరిక రవీందర్ అన్నారు. మంగళవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై పెరిక రవీందర్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులను బెదిరించడం, బలవంతం చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం ,మోసం చేయడం, అపహరించడం ,అక్రమ రవాణా కొరకు ప్రేరేపించడం చేస్తే చట్ట ప్రకారం నేరమని ఇలాంటప్పుడు చైల్డ్ టోల్ ఫ్రీ నెంబర్ 100,1098,112, సంప్రదించాలని కోరారు, ఎయిడ్ సంస్థ జిల్లా బాధ్యులు వగ్గు సోమన్న మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా చేయడం ఘోరమైన నేరమని, దీనినీ అరికట్టడానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. పిల్లలను అక్రమ రవాణా చేయడం ద్వారా వ్యభిచార వృత్తులకు పిల్లలను దించడం, చట్టపరమైన నేరమని ,పిల్లలు పనిలో కాదు బల్లో ఉండాలని, కోరారు. వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఎంఈఓ రవి,ఇన్చార్జి తాసిల్దార్ లాలు, ఏపిఎం అజయ్ , ఇన్చార్జి ప్రిన్సిపాల్ కళావతి, హెచ్ఈఓ సునంద హెల్త్, సూపర్వైజర్ సైదులు ,ఐసిడిఎస్ సూపర్వైజర్ హనీప,సిఆర్పిఎఫ్ డివిజన్ కన్వీనర్ గజ్జెల ల ధర్మారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.