బిసి ఫెడరేషన్ కులాల సమితి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎల్సోజు నవీన్ కుమార్
తిరుమలగిరి 04 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఎల్సోజు నవీన్ కుమార్ ను బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన బీసీ ఫెడరేషన్ కులాల సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు.
ఎల్సోజు నవీన్ కుమార్ గత oలో సూర్యాపేట జిల్లా బీసీ ఫెడరేషన్ కులాల సమితి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్సోజు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీసీ ఫెడరేషన్ కులాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతానని తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుందని దానిలో భాగంగానే నేడు బీసీ ఫెడరేషన్ కులాలకు పాలకమండలి ఏర్పటూ చేసి నిధులను విడుదల చేస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. నేను జిల్లా అధ్యక్షునిగా చేసినటువంటి కార్యక్రమాలను చూసి సంఘాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ నాపై ఇంత బాధ్యతను ఉంచడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. నన్ను గుర్తించి బీసీ ఫెడరేషన్ కులాల సమితికి రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. తన ఎన్నికకు సహకరించిన బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావు, రాష్ట్ర కోశాధికారి పసుపులేటి కరుణాకర్, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు నర్సింగ్ గంగపుత్ర తదితర రాష్ట్ర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.