విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక విద్యకు దూరం
సుమారు 150 గ్రామాలకు బస్సు తిరగని పరిస్థితులు.
జోగులాంబ గద్వాల 5జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : దేశానికి స్వాతంత్ర అనంతరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం వెలసిన. జోగులాంబ గద్వాల జిల్లా విద్యాభివృద్ధిలో వెనుకబాటే. జిల్లాలోని 14 మండలాల్లో గట్టు మండలం రాష్ట్రంలోనే విద్య లో పూర్తిస్థాయి వెనుకబడి ఉంది. దీనికంతటికి రవాణా సౌకర్యం లేక పోవడమే ప్రధాన కారణం. జిల్లాలోని సుమారు 150 గ్రామాలకు బస్సులు తిరగని పరిస్థితులు కనబడుతున్నాయి. గద్వాల జిల్లాలోని 255 గ్రామపంచాయతీ లోను 150 గ్రామాల్లోని పల్లెలకు బస్సులు లేక పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరమై పోతున్నారు. ధరూరు నందిన్నె మండలంలోని. ఇరికిచేడు పాన్గుంట వెంకటాపురం కిష్టాపూర్. పాతపాలెం. గంగంపల్లి. ఎల్లాపూర్ బిచ్చనియర్. చింతకుంట. సోంపురం. ఎస్ ఎన్ చోడ్. గువ్వల దీన్నే. కొండాపురం. రంగాపురం. పూజారి తండా. తదితర గ్రామాలకు నేటికీ బస్సు లేక విద్యార్థులు కాలినడకన 15 కిలోమీటర్లు ప్రయాణించి చదువుకుంటున్నారు. పై చదువులు చదువుకోడానికి ఆర్థిక స్తోమత లేక. రవాణా సౌకర్యాలు అందుబాటులో లేక దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని ఇంటర్ చదువులు మానేసి విద్యార్థులు పనులకు. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. విద్యాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్న పేద మధ్య తరగతిలోని కుటుంబాలు చదువుకోవడానికి ఇష్టంగా ఉన్న రవాణా సౌకర్యాలు లేక పోవడం ప్రధాన కారణమని చెప్పవచ్చు. పల్లెల్లోని ప్రైవేటు వాహనాలు దారులు రాత్రి వేళలో తాగి మద్యం మత్తులో పిల్లల్ని ఆగాయతాలు వంటివి చోటు చేసుకోవడం వలన తల్లిదండ్రులు బయందోళన చెందుతారు. ఆడపిల్లలు బయటికి వెళ్లి ఇంటికి వచ్చేవరకు బెంగతో తల్లిదండ్రులు దిగులు చెందుతున్నారు. జిల్లాలోని కేటి దొడ్డి ధరూరు. ఉండవెల్లి ఐజ. మనవడు ఇటిక్యాల ఎర్రవల్లి. అల్లంపూరు మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేవని నిత్యం ప్రైవేటు వాహనాల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామీణ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఊరికి బసౌకర్యం ఉంటుందని ఆశించిన అందుకు భిన్నంగా పరిస్థితులు మారాయని గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. జిల్లాలోని పేద వర్గాల్లోనే విద్యార్థులకు. పై చదువులు చదువుకోవడానికి నిరక్షరాసులైన తల్లిదండ్రులు. విద్యార్థులకు అవగాహన లేక. సపోర్టు లేక. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడానికి అవకాశాలు లేకపోవడం వంటి తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఫ్రీ బస్ ఏర్పాటు చేసిన అది గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఉపయోగపడటం లేదని తెలుస్తుంది. పట్టణ మండల జిల్లా రాష్ట్రస్థాయిలోని నిత్యం ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఒంటి మహిళలకు ఫ్రీ బస్సు అవసరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కు సొంత ఊరికి వెళ్లాలంటే. ప్రభుత్వ బస్సులు లేక. ప్రైవేటు వాహనాలపైనే సొమ్ము ఖర్చు పెట్టుకొని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రవాణా సౌకర్యాన్ని అభివృద్ధి చేయాలని జిల్లాస్థాయి అధికారులకి.గ్రామస్థాయిలోని బస్సు లేని గ్రామాల ప్రజలు స్వచ్ఛంద సంస్థలు పలుమార్లు విన్న మించిన ప్రయోజనం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ నేటికీ రవాణా సమస్య తీవ్రంగా వేధిస్తుంది. ప్రైవేటు వాహనదారులు తమ స్వలాభం కోసం అవసరాన్ని బట్టి అధిక సొమ్ము వసూలు చేస్తున్నారు. దీనితో సామాన్య ప్రయాణికులకు ఆర్థిక భారంగా మారింది. ఇలాగ బస్సు లేక విద్యార్థులు చదువుకోలేక కాలినడకన పోయి రావడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. వర్షాకాలం వస్తే పుస్తకాల్లో బట్టలు తడిసిపోయి ఆరోగ్యము క్షీణిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదాలు. భయాందోళనలతో ఏర్పడి. తల్లిదండ్రులు దిగులు చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నత అధికారులు స్పందించి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా ప్రజలు స్థానికులు కోరుతున్నారు.