బడి పిల్లలకు మహనీయుల చిత్రాలు ఆట వస్తువులు బహుమతి

మానవాళికి ఏ పని చేసిన చదువు ఎంతో ముఖ్యం డాక్టర్ పెండెం కృష్ణ కుమార్

Nov 6, 2024 - 18:58
Nov 6, 2024 - 19:30
 0  6
బడి పిల్లలకు మహనీయుల చిత్రాలు ఆట వస్తువులు బహుమతి

తెలంగాణ వార్త పెన్ పహాడ్ మండలం  6 నవంబర్:-  పెన్ పహాడ్ మండల పరిధిలోని సింగిరెడ్డిపాలెం గ్రామ పాఠశాలలో ప్రస్తుత భారత దేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది మురుము పిలుపు మేరకు రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక సమావేశమై ప్రశంసలు పొంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాలుగు సార్లు పొందిన విభిన్న పాత్రాభినయ కళాకారులు, సమాజ సేవకులు, రచయిత డా,, పెండెం కృష్ణ కుమార్ సింగిరెడ్డిపాలెం పెన్ పహాడ్ మండలం)లోని ప్రాథమిక పాఠశాలకు అనేక దేశ నాయకుల, సరస్వతి దేవి, సర్వేపల్లి రాధాకృష్ణ, బాలల దినోత్సవ నెహ్రూ, శ్రీనివాస రామానుజన్, సావిత్రిబాయి పూలే చిత్రపటాలు, మెడికల్ కిట్టు, వాటర్ క్యాన్ , ఆట వస్తువులు వాలీబాల్, క్రికెట్ బ్యాట్, బాల్, స్కిప్పింగ్ రోప్స్, మల్టిపుల్ చెస్ గేమ్, వరల్డ్, ఇండియా మ్యాప్స్, గోడ గడియారం,విటమిన్ సి టాబ్లెట్లు, మరియు క్లాత్ బాగ్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బి.నరేందర్ మాట్లాడుతూ దాత పెండెం కృష్ణ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల క్రీడా సామాగ్రిని ,దేశభక్తిని పెంపొందించడానికి దేశ నాయకుల పటాలను, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి శాస్త్రవేత్తల పటాలను, పర్యావరణ పరిరక్షణ అలవర్చడానికి క్లాత్ బ్యాగులను అందించి పాఠశాలను సందర్శించడం మంచి విషయాలను చెప్పి విద్యార్థులలో ఎంతో స్ఫూర్తిని నింపిందని, అది వారి భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని ,ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు వారి కృషి ఎంతో ప్రశంసదాయకమని,వందలాది పాటశాలల్లో చేసిన సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. 333 పాత్రలలో హిస్టారికల్, మైథాలజికల్, సోషల్, ఫ్రీడమ్ ఫైటర్స్, స్త్రీ, పురుష అన్ని రకముల పాత్రలలో నటించిన డా,, పెండెం కృష్ణ కుమార్ అభినందనీయులు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు బోల్లేద్దు నరేందర్ నల్ల శ్రీనివాసులు, సరిత, ప్రమీల పాల్గొన్నారు.

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State